Begin typing your search above and press return to search.
ట్విటర్ పిట్ట దిగి వచ్చింది.. రాహుల్ ఖాతాను రీఓపెన్
By: Tupaki Desk | 15 Aug 2021 4:21 AM GMTమూర్ఖత్వానికి.. మొండితనానికి నిలువెత్తు రూపంగా మారుతోంది ట్విటర్. ప్రపంచ రాజకీయాలతో పాటు.. పలు పరిణామాలకు కీలకంగా మారిన ఈ సోషల్ మీడియా సంస్థ.. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే కాదు.. తనకు మించిన పోటుగాళ్లు మరెవరూ ఉండరన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటుంది. వివాదాల్ని కోరి తెచ్చుకోవటంలో దీని తర్వాతే ఎవరైనా. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయటం ఒక ఎత్తు అయితే.. అభ్యంతరకర పోస్టుల పేరుతో ఆయన పార్టీకి చెందిన ఐదు వేల మంది ఖాతాల్ని బ్లాక్ చేయటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?
నిజంగానే రాహుల్ గాంధీ లాంటి ఒక ప్రముఖ నేత ఖాతాలో పొరపాటు దొర్లితే.. వెంటనే దానికి సంబంధించిన చర్యల్ని వ్యక్తిగత స్థాయిలో చేయొచ్చు. కానీ.. అలా చేస్తే అది ట్విటర్ ఎందుకు అవుతుంది? ఒక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించిన వేళలో తీసిన ఫోటోను ట్విటర్ లో పోస్టు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దాన్ని తొలగించాలని కోరితే పరిస్థితి ఎలా ఉండేదో? అందుకు భిన్నంగా రాహుల్ ఖాతాను బ్లాక్ చేయటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ట్విటర్ చర్య కాంగ్రెస్ వ్యతిరేకులకు సంతోషాన్ని ఇవ్వొచ్చేమో కానీ.. ఏదో సాకు చూపించినట్లుగా రాహుల్ ఉదంతంలో వ్యవహరించారే తప్పించి.. నిజంగానే ట్విటర్ కు కమిట్ మెంట్ ఉంటే.. దానిలో ఉండే ఛైల్డ్ ఫోర్నోగ్రఫీతో పాటు ఉగ్రవాద అంశాలకు సంబంధించిన లింకుల్ని తొలగించాల్సిన అవసరం చాలానే ఉంది. వాటిని పక్కన పెట్టి.. చిన్న విషయాలకు మరీ ఎక్కువగా రియాక్టు కావటం.. రాజకీయ అలజడి చోటు చేసుకునే పరిస్థితుల్ని కల్పించుకోవటం ట్విటర్ కు అలవాటుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.
రాహుల్ తో పాటు.. వేలాది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఖాతాల్ని బ్లాక్ చేయటంపై ట్విటర్ పై తీవ్ర ఆగ్రహాంతో పాటు వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. జరిగిన తప్పును ట్విటర్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్దరించారు. దీంతో.. రీఓపెన్ అయిన ఆయన ఖాతాలో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఒక వివాదం సద్దుమణిగిందని చెప్పొచ్చు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవటమన్న సామెతను గుర్తు తెచ్చేలా ట్విటర్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.