Begin typing your search above and press return to search.
హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ - ప్రియాంక కు అనుమతి!
By: Tupaki Desk | 3 Oct 2020 5:45 PM GMTహత్రాస్ లో అమానుషంగా దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా పోలీసుల సాయంతో రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు జరిపించిన ఆటవిక చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూపీతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే , రెండు రోజుల క్రితం ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక ను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఆ తర్వాత ఈ ఘటన పై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా, నేడు ఈ ప్రపంచంలో తనను ఎవరూ ఆపలేరని, హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నానని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత రాహుల్ , ప్రియాంక తమ సొంత కారులో డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. అయితే వీరిని అడ్డుకోవడానికి మరోసారి పోలీసులు కూడా పరుగు పరుగున వచ్చారు. కానీ , ఈ ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటం తో వారికీ అనుమతి ఇవ్వక తప్పలేదు. చివరికి ఒత్తిడి కొద్దీ కాంగ్రెస్ నేతలను అనుమతించినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ ,ప్రియాంక తో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురికి మాత్రమే అనుమతించామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.