Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ మీద రాహుల్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   10 Sep 2022 2:30 AM GMT
కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ మీద రాహుల్ కామెంట్స్!
X
ఇప్పటికి సరిగ్గా మూడేళ్ల క్రితం రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దానికి ముందు అంటే కేవలం ఏడెమింది నెలల పాటు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాలు రాహుల్ ని నిరాశపరచాయి. దాంతో ఆయన అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు.

నాటి నుంచి సోనియా గాంధీ టెంపరరీ ప్రెసిడెంట్ గా ఆ పదవిలో కొనసాగుతున్నాయి. ఇక తొందరలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు ఉన్నాయి. రాహుల్ చూస్తే భారత్ జోడో యాత్రలో ఉన్నారు. ఆయన తమిళనాడు పాదయాత్రలో ఉండగా మీడియా నుంచి ఒక కీలకమైన ప్రశ్న వచ్చింది. మీరు అధ్యక్షుడిగా ఉంటారా అంటూ. దానికి రాహుల్ నో అని చెప్పలేదు, అలాగని ఎస్ అని కూడా అనలేదు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఏం చేయాలో తాను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాన‌ని మాత్రమే చెప్పుకొచ్చారు. ఎన్నిక జరిగినపుడు తాను అధ్యక్షుడిగా ఉంటానా లేదా అన్నది కూడా తెలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఒక విధంగా రాహుల్ మాటలు చూస్తే తాను అధ్యక్ష పగ్గాలు స్వీకరిస్తారు అన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు అని అంతా అంటున్నారు.

అదే టైం లో తాను ఒక నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాను అని చెప్పడం ద్వారా ఎవరో ఒకరిని పోటీ చేయిస్తామని చెప్పడమూ ఉందని అంటున్నారు. మొత్తానికి రాహుల్ కామెంట్స్ అయితే ఆసక్తిగా ఉన్నాయి. అయితే అందులో అర్ధాలు ఎవరికి వారు వెతికే పనిలో ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కి ఫోకస్ అట్రాక్షన్ అంటే రాహుల్ గాంధీయే. ఆయన కాబట్టే భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు.

ఆయన రేపటి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా మీడియా అటెంక్షన్ మాత్రమే కాదు రాజకీయ పార్టీల టార్గెట్ కూడా ఆయన వైపే ఉంటుంది. అయితే టెక్నికల్ గా ఆయన ఆ పదవిలో ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. దాంతో పాటుగా మరో విషయం ఉంది. భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ టైం లో రాహుల్ కనుక ప్రెసిడెంట్ హోదాలో తిరిగితే పూర్తిగా జోష్ క్యాడర్ లో నింపిన వారు అవుతారు అన్న సలహా సూచనలు వస్తున్నాయి.

అయితే రాహుల్ గాంధీ తాను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నారు. మరి అది క్యాడర్ కోరుకున్నదైతే టోటల్ పార్టీకే పూర్తి ఆనందమే ఒకవేళ ప్రెసిడెంట్ గా ఎవరో ఒకరిని నిలబెట్టి రాహుల్ జస్ట్ ఒక లీడర్ గా ఉంటాను అంటే మాత్రం పాదయాత్ర జోష్ ఎంత ఉన్నా అది నిరాశను పరచేదే అవుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.