Begin typing your search above and press return to search.
తన ఆఫీస్ ను ధ్వంసం చేసిన వారిపై రాహుల్ వ్యాఖ్యలు విన్నారా?
By: Tupaki Desk | 2 July 2022 4:58 AM GMTఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలనే గాంధీ సిద్ధాంతాన్ని తన మనసులో నింపుకున్నట్లుగా మాటలు చెప్పటం ఇప్పటి రోజుల్లో సాధ్యం కాదు. ఒక చెంప మీద కొట్టటానికి ముందే ఆత్మరక్షణ కోసం రెండు చెంపల్ని కొట్టేసినట్లుగా మాట్లాడే నేతలు మన చుట్టూ కనిపిస్తుంటారు. అందుకు భిన్నంగా తన మాటలతో అందరికి విస్మయానికి గురి చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ.
తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లో తన ఆఫీసును కమ్యునిస్టు పార్టీ విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కు చెందిన వారు దాడి చేసి.. ధ్వంసం చేసిన వైనంపై స్పందించారు.
వారంతా పిల్లలని.. వారిపై ఎలాంటి కోపం.. ద్వేషం లాంటివి లేవన్నారు. హింస ఏ సమస్యనూ పరిష్కరించలేదన్న ఆయన.. తాజాగా కేరళలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ దాడిలో గాయపడిన తన పార్టీ కార్యకర్తల్ని పరామర్శించారు. ధ్వంసమైన తన ఆఫీసును ఆయన పరిశీలించారు.
తన ఆఫీసును ధ్వంసం చేసిన వారి విషయంలో ఇంత విశాలంగా రియాక్టు అయిన రాహుల్..తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు అయిన గాయాల మాటేంటి? వారిని గాయపర్చిన వారు కూడా పిల్లలుగానే రాహుల్ చూస్తారా? అన్నది ప్రశ్న.
ఎప్పటిలానే ప్రధానమంత్రి మోడీపై ఘాటుగా రియాక్టు అయ్యారు. జీఎస్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్.. "మా హయాంలో జీఎస్టీ నిజమైన సాధారణ పన్ను. బీజేపీ ప్రభుత్వం దాన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా మార్చేసింది. జీఎస్టీ భారం కారణంగా దేశంలోని పలు సూక్ష్మ.. చిన్న.. మధ్య తరహా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందన్నారు.
తాము పవర్లోకి వస్తే జీఎస్టీ 2.0 ద్వారా సాధారణమైన.. తక్కువ పన్ను విధానాన్ని తీసుకొస్తామన్నారు.
గబ్బర్ సింగ్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన 1826 రోజుల్లో ఆరు రకాల రేట్లు.. వెయ్యికి పైగా మార్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాహుల్ తీరు మెతగ్గా ఉందని.. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో ఇంత నెమ్మదిగా మాట్లాడితే వర్కువుట్ అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.