Begin typing your search above and press return to search.
పాక్‌ను విమర్శిస్తే...రాహుల్ హర్టయ్యాడు!
By: Tupaki Desk | 12 Dec 2016 4:49 AM GMTపాకిస్తాన్ ను విమర్శిస్తే ఆ దేశం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ బాధపడుతుందని బీజేపీ తరచుగా ఎద్దేవా చేయడంలో నిజం ఉందనే రీతిలో రాహుల్ గాంధీ ప్రవర్తించారు. మతప్రతిపాదికన భారత దేశాన్ని విభజించడానికి పాకిస్థాన్ కుట్ర చేస్తున్నదని, అది ఎన్నటికీ నెరవేరదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కథువా జిల్లాలో జరిగిన షహిదీ దివస్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ఈ కామెంట్లు చేయగా...కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అదే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
జమ్ముకాశ్మీర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదం ద్వారా భారత్ నుంచి జమ్ముకశ్మీర్‌ను వేరు చేయాలని పాకిస్థాన్ చూస్తుందన్నారు. పిరికి వారి ఆయుధం ఉగ్రవాదమని, అది ధైర్యవంతుల లక్షణం కాదన్నారు.మత ప్రతిపాదికన మళ్లీ ఒక్కసారి దేశం విభజనకు గురికాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమైతే, పాకిస్థాన్ 10దేశాలుగా ముక్కలవుతుందని హోంమంత్రి హెచ్చరించారు. స్నేహ హస్తం అందిస్తే యురి, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడుల రూపంలో బదులు ఇచ్చిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ పదేపదే దాడులకు తెగబడుతున్నా భారత్ ఎప్పుడూ మొదట కాల్పులు జరుపలేదని హోం మంత్రి అన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడం పాకిస్థాన్‌కు చేతకాకపోతే, ఆ దేశం కావాలనుకుంటే భారత్ సహాయం అందిస్తుందని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్ నాలుగుసార్లు యుద్ధానికి దిగిందని, ప్రతిసారి భారత సైన్యం సరైన గుణపాఠం నేర్పించదన్నారు.
అయితే దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. మతప్రతిపాదిక భారత దేశ విభజనకు పాకిస్థాన్ కుట్ర చేస్తుందన్న అంశాన్ని తాను అంగీకరిస్తానని తెలిపారు. కానీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు.