Begin typing your search above and press return to search.
లేడీస్ టాయిలెట్లో యువరాజు!
By: Tupaki Desk | 12 Oct 2017 4:45 AM GMTకాంగ్రెస్ పార్టీ కి చెందిన యువరాజు - భవిష్యత్ ప్రధాన మంత్రిగా చాటుకుంటూ ఉండే రాహుల్ లేడీస్ టాయిలెట్లోకి దూరే సరికి చూస్తున్న వారంతా నివ్వెరపోయారు. అసలే అది మోడీ సామ్రాజ్యం అయిన గుజరాత్.. పైగా లేడీస్ టాయిలెట్లోకి దూరిన కాంగ్రెస్ యువరాజు.. మోదీ మీద విరుచుకుపడుతూ ఉండే వ్యక్తి. దీంతో క్షణాల్లో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ మీద పుంఖాను పుంఖాలుగా సెటైర్లు పేలాయి. ఆయన పొరబాటు గురించి... నెటిజన్లు వరుస జోకులు పేలుస్తూనే ఉన్నారు.
ఆన్ లైన్ వేదికగా తాను ప్రత్యర్థుల మీదికి విమర్శనాస్త్రాలను సంధించడం మాత్రమే కాదు. ఒక్కొక్కసారి తాను కూడా ఆన్ లైన్ వెటకారాలకు దారుణంగా బలి కావాల్సి ఉంటుందనే సంగతి రాహుల్ కు తెలియని విషయం ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే.. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన నోరు జారి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడడం, సోషల్ మీడియాలో అవి వైరల్ కావడం - రాహుల్ అమాయకత్వం అవగాహన లేమి గురించి జోకులు పేలడం చాలా సాధారణంగా జరుగుతూ వచ్చింది. ఇలాంటి అనుభవాలు రాహుల్ కు పుష్కలంగా ఉన్నాయి. అయినా ఆయన వైపు నుంచి మరో పొరబాటు దొర్లిపోయింది.
అటు భాజపా నాయకులు తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించి.. తనను ఓడించాల్సిందిగా, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంటే.. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో రాహుల్ పర్యటించారు. చోటా ఉదయపూర్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ టాయిలెట్ కు వెళ్లాల్సి వచ్చేసరికి రాహుల్.. కు చిక్కు ఎదురైంది. టాయిలెట్ల బయట గుజరాతీ భాషలో రాసి ఉన్న బోర్డులను చదివి అర్థం చేసుకోవడంలో ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. బోర్డులతో పాటు మగ- ఆడ బొమ్మలు అక్కడ ఉన్నాయో లేదో గానీ.. రాహుల్ ఎంచక్కా లేడీస్ టాయిలెట్లోకి దూరేశారు. ఆయన వెంట అక్కడిదాకా వెళ్లిన అభిమానులు బయటినుంచి గగ్గోలు పెట్టేలోగా.. లోనికి వెళ్లిన ఆయన కూడా జరిగిన పొరబాటును గ్రహించి వెలుపలికి వచ్చేశారు. కానీ సోషల్ మీడియా చెలరేగిపోవడానికి ఈ మాత్రం వ్యవధి చాలు కదా.
రాహుల్ చేసిన పొరబాటు.. ఇప్పుడు వైరల్ అవుతోంది. అరుదుగా జరిగినప్పుడు ఇలాంటి పొరబాట్లు సరదాగానే ఉంటాయి గానీ.. అదే పనిగా అనేక పొరబాట్లు జరుగుతూ ఉంటే.. నాయకుడి ఇమేజికి కూడా డ్యామేజీ జరుగుతుంది. అవునంటారా కాదంటారా?