Begin typing your search above and press return to search.
మోడీ యాప్...డేటా దొంగతనం చేసే వేదిక
By: Tupaki Desk | 26 March 2018 4:40 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా నిబంధనలను ఉల్లంఘిస్తూ కేంబ్రిడ్జి ఎనాలిటికా డేటాను చోరి చేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. డేటా కంపెనీతో మీకు సంబంధాలున్నాయంటే - మీకు సంబంధాలున్నాయంటూ విమర్శించుకుంటున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నిరాకరించింది. అయితే అదే సమయంలో కేంబ్రిడ్జి ఎనాలిటికా వివాదం నేపథ్యంలో మోడీపై రాహుల్ దాడి తీవ్రతను పెంచారు. మోడీ అధికారిక నమో యాప్ నుంచి సమాచారం ఇతరులకు చేరుతుందని - యాప్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు.
నమో యాప్ నుంచి సమాచార ఉల్లంఘన జరుగుతున్నదని ఫ్రెంచ్ హ్యాకర్ పేర్కొన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోడి యాప్ కోరుతూ అప్లికేషన్ కోసం సైన్ అప్ చేసిన వారి డేటాను తీసుకు వెళ్ళేందుకు అమెరికన్ కంపెనీలను ఆయన అనుమతించారన్నారు. `హాయ్.. నా పేరు నరేంద్ర మోడి. నేను భారత ప్రధానిని. మీరు నా అధికారిక యాప్‌ను లాగిన్ కాగానే మీ సమాచారం అమెరికాలో ఉన్న నా స్నేహితుల కంపెనీలకు చేరవేస్తా` అని రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సమాచార దోపిడీ అనే ఆరోపణలు మోడీ ఇంటి గడప వరకు వచ్చాయి అనే శీర్షికతో ఉన్న వార్తా కథనాన్ని జోడించారు. ప్రధాని మోడీ యాప్ పై ఇంతటి ఆరోపణలు వస్తున్నా మీడియా మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ స్పందించింది.
రాహుల్ నుంచి ఇంత కంటే ఎక్కువ తాము ఏమీ ఆశించలేదని పేర్కొంది. రాహుల్.. నమో యాప్ ను డౌన్ లోడ్ చేసుకో. దేశంలో జరుగుతున్న మంచి పనులను తెలుసుకో అని బీజేపీ ట్వీట్ చేసింది. కాగా, ఆదివారం పాత మైసూర్ లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ జేడీఎస్ విధానం జనతాదళ్ సంఘ్ పరివార్ గా మారిందన్నారు. మీరు బీజేపీకి మద్దతుగా ఉంటున్నారా? లేదా? బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నా రా? లేదా? అని జేడీఎస్ ను రాహుల్ ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానాలను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతున్నదని రాహుల్ విమర్శించారు.