Begin typing your search above and press return to search.
ఆ ఫ్యామిలీస్ ఫ్లైట్లలో మోడీ ఫారిన్ ట్రిప్స్?
By: Tupaki Desk | 20 Dec 2016 12:30 PM ISTప్రధాని మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. గతానికి భిన్నంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న రాహుల్.. తాజాగా ఘాటైన ఆరోపణ చేశారు. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోడీ వ్యక్తిగత అవినీతికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా చెప్పిన రాహుల్.. ఆ వివరాల్ని పార్లమెంటులో ప్రస్తావించాలని తాను అనుకుంటున్నట్లుగా వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో.. మోడీపై ఉన్న ఆరోపణల్ని సభలో ప్రస్తావించే వీల్లేదు.
ఈ విషయాన్ని గుర్తించారో ఏమో కానీ.. మోడీ మీద వ్యక్తిగత విమర్శలపై రాహుల్ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన మోడీ ఫారిన్ టూర్లపై ఆసక్తికర ఆరోపణ చేశారు. తన సంపన్న మిత్రుల విమానాల్లో ప్రధాని అమెరికా.. చైనాల్లో పర్యటిస్తున్నట్లుగా ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో 99శాతం నిజాయితీపరులను అపహాస్యం చేశారని మండిపడ్డ ఆయన.. దేశంలో యాభై మంది సంపన్నుల వద్ద గరిష్ఠంగా సంపద ఉందన్నారు.
వారికి చెందిన విమానాల్లో ప్రధాని ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గరిష్ఠ సంపద యాభై కుటుంబాల వద్దే ఉందని.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని వారి విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారన్న రాహుల్.. 94 శాతం నల్లధనం విదేశీ బ్యాంకులు.. స్థిరాస్తులు.. భూలావాదేవీల్లో పెట్టుబడులు.. బంగారం రూపంలో మూలుగుతుందన్నారు. వాటిని వదిలేసి.. సామాన్యుల మీద మోడీ పడ్డారన్నారు. యాభై కుటుంబాలు తీసుకున్న రూ.1.10లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారని ఆరోపించారు. మరీ.. ఆరోపణలకు కమలనాథులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/