Begin typing your search above and press return to search.
రాహుల్ స్పీచ్ లో ఇలాంటి తప్పు దొర్లడం ఏంటో?
By: Tupaki Desk | 12 Sep 2017 5:33 AM GMTతనవైపే ఇటు స్వపక్షంతో పాటు అటు విపక్షం కళ్లు కూడా ఉంటాయని తెలిసినప్పటికీ....కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఇంకా జాగ్రత్త పడటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎక్కడ, ఎంత బాగా మాట్లాడినా.. అందులో ఏదో ఒక చిన్న తప్పు చేయకుండా మాత్రం ఉండలేరు. అయితే తాజాగా రాహుల్ చేసింది పెద్ద తప్పే అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం బాగానే ఆకట్టుకుంది. అయితే ఆయన మాత్రం ఈ స్పీచ్ లోనూ తెలిసో తెలియకో మరో పొరపాటు చేశారు.
కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థులతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ.. లోక్ సభలో మొత్తం సీట్లు 546 అని రాహుల్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి లోక్ సభలో ఉన్న స్థానాలు 545. అందులోనూ ఓ చట్టసభలో మొత్తం స్థానాల సంఖ్య సరిసంఖ్యలో ఉండవని కూడా రాహుల్ కు తెలియదా అంటూ ట్విట్టర్ లో జోకులు పేలాయి. ఒక్క పొరపాటు కూడా చేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని ఊహించలేమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటివి చమక్కులు లేకుండా రాహుల్ స్పీచ్ ఊహించలేమని మరొకరు గిల్లారు.
మరోవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో తాను పీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కానీ ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ పాలన పట్ల కూడా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. విభజన రాజకీయాలతో మోడీ దేశాన్ని చీలుస్తున్నారని రాహుల్ అన్నారు. తనతో పనిచేస్తున్న ఎంపీలతోనూ మోడీ అభిప్రాయాలు పంచుకోలేరన్నారు. సభల్లో జనం కోసం వివిధ రకాల సందేశాలను ఇవ్వడంలో మోడీ దిట్ట అని, చాలా ప్రభావంతమైన సందేశాలను ప్రధాని ఇస్తారని రాహుల్ అన్నారు. మోడీ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉందని, ప్రధాని తన కన్నా మంచి వక్త అన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్లే కశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు పెరిగాయని రాహుల్ అన్నారు. అందువల్లే అక్కడ హింస పెరిగిందన్నారు.
రాజకీయాల్లోకి యువతను తీసుకువచ్చేందుకు పీడీపీ పార్టీ కీలక పాత్ర పోషించిందని, కానీ మోడీ వాళ్లతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని దెబ్బతీసారని రాహుల్ గాంధీ అన్నారు. కేవలం 30 రోజుల్లోనే పీడీపీని నాశనం చేశారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కశ్మీర్ లో శాంతి నెలకొల్పామన్నారు. జమ్మూకశ్మీర్ అంశంపై సుమారు తొమ్మిదేళ్ల పాటు మాజీ ప్రధాని మన్మోహన్ - మంత్రులు చిదంబరం - జైరామ్ రమేశ్ లతో పనిచేసినట్లు రాహుల్ గుర్తు చేశారు. హింస వల్లనే తన తండ్రి - నానమ్మను కోల్పోయానని, అలాంటి హింసను తాను అర్థం చేసుకోకపోతే మరి ఎవరు అర్థం చేసుకుంటారని రాహుల్ ప్రశ్నించారు.