Begin typing your search above and press return to search.
ఇంకో సంచలనం..సంఘ్ సదస్సుకు రాహుల్
By: Tupaki Desk | 27 Aug 2018 4:45 PM GMTరాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్. హిందుత్వ సిద్ధాంతాలతో సాగే బీజేపీకి మాతృక. ఈ వేదిక ఇప్పుడు మరోమారు అనూహ్య రీతిలో తెరమీదకు వచ్చింది. ఈ ఏడాది జూన్ లో నాగ్ పూర్ లో జరిగిన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్.. ఆ పార్టీ బద్ధశత్రువు ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే ఆహ్వానం పంపాలని ఆరెస్సెస్ భావిస్తుండటం చర్చనీయాంశమైంది.
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత - కాంగ్రెస్ లో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల తర్వాత అంతటి ప్రభావం చూపే ఛరిష్మా కలిగిన నాయకుడు - రాజకీయ ప్రత్యర్థులు సైతం అజాతశత్రువుగా సంబోధించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది జూన్ నెల 7న నాగ్ పూర్ లో జరిగే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల శిక్షణ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. మొదటినుంచీ కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ముఖర్జీ.. ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో ఏం మాట్లాడుతారోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందాయి. సమావేశానికి హాజరవడం ద్వారా మతసహనం అనే కీలక అంశంపై హితబోధ చేసేలా ప్రణబ్ మాట్లాడారు. అయితే, ప్రణబ్ తో రాక అనంతరం సంఘ్ పట్ల పలు వర్గాల నుంచి ఆసక్తి పెరిగింది. ఈ నెల ఆరో తేదీ వరకు జాతీయ స్థాయిలో రోజూ సగటున 378 మంది ఆరెస్సెస్ లో చేరతామని జాయిన్ ఆరెస్సెస్ వెబ్ సైట్ లో విజ్ఞప్తులు వచ్చేవని - ప్రణబ్ సందర్శించిన తర్వాత రోజూ సగటున 1200-1300 విజ్ఞప్తులు వస్తున్నాయని సంఘ్ నేత తెలిపారు. వాటిల్లో 40 శాతం బెంగాల్ నుంచేనని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇలా కాంగ్రెస్ నేత రాకతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచిన సంఘ్ తాజాగా దేశాన్ని మతపరంగా విభజిస్తున్నదంటూ ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి సంఘ్ ఆహ్వానించనుందని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాహుల్ తోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలాంటి ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నది. భవిష్యత్తు భారత్ పై ఈ కార్యక్రమంగా ప్రధానంగా దృష్టి సారించనుంది. అయితే, దీనిపై కాంగ్రెస్ తరఫున ఎలాంటి స్పందన రాలేదు.