Begin typing your search above and press return to search.
రాహుల్, మోడీ పెట్టుబడులు, షేర్లు ఇవే..
By: Tupaki Desk | 29 April 2019 9:40 AM GMTదేశంలో నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే పూర్తైన మూడు విడతల కన్నా.. నాలుగో విడతలో హేమాహేమీలైన నేతలు బరిలో ఉన్నారు. చివరి విడతకు కూడా నామినేషన్ల స్వీకరణకు వేళ కావడంతో అందరూ నామినేషన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగానే నేతల జాతకాలు, పర్సనల్ విషయాలన్నీ అఫిడవిట్ల సాయంతో బయటకు వస్తున్నాయి.
చాలా మంది నేతలు తమ డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్లుగా, ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టినట్లు అఫిడవిట్ల ద్వారా తేలింది. కొందరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్చేంజీలోనూ పెట్టారు. మరికొందరు బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి ఇన్ స్టాల్ మెంట్లలో పెట్టుబడులు పెట్టారు.
తాజాగా నామినేషన్లు వేసిన ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల జాతకాలు కూడా బయటపడడం విశేషం. గడిచిన 18 సంవత్సరాల్లో ప్రధాని మోడీకి ఐదుసార్లు, రాహుల్ కు ఆరుసార్లు ఆదాయపు పన్ను రీఫండ్లు వచ్చాయని ఎన్నికల అఫిడవిట్ల ద్వారా తెలిసింది.
ఇక ప్రధాని మోడీ కూడా పెట్టుబడులకు ప్రధాన్యమిచ్చారు. కానీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఆయన పెట్టుబడులు పెట్టలేదు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం తన పేరుతో, తన భార్య పేరుతో షేర్లను కలిగి ఉన్నాడు. రాజకీయాల్లోకి రాకముందే అమిత్ షా ప్రొఫెషనల్ స్టాక్ బ్రోకర్ గా ఉండేవారు. అమిత్ షాకు రిలయన్స్ ఇండస్ట్రీస్- టీసీఎస్- హెచ్ యూఏల్- బజాజ్- ఎల్ అండ్ టీ అల్ట్రాటెక్ సంస్థల్లో పెట్టుబడులున్నాయి. భారీగా షేర్లను కలిగి ఉన్నారు. మార్చి 22 నాటికి రూ.17.56 కోట్ల షేర్లున్నాయని అఫిడవిట్ లో తెలిపారు. తన భార్య సోనాల్ బెన్ షా పేరిట రూ.4.35 కోట్ల షేర్లున్నాయని వెల్లడించారు. ఆయన ఆస్తుల మొత్తం రూ.30.49 కోట్లుగా పేర్కొన్నారు.
ఇక రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కూడా ఐదుసార్లు ఐటీ రీఫండ్స్ ను పొందినట్టు అఫిడవిట్ లో పొందుపరిచింది. రాహుల్ ఈ సంవత్సరం 2017-18 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయాన్ని రూ.1.11కోట్లకుపైగా చూపించారు. సోనియాగాంధీ మాత్రం కేవలం రూ.9.6లక్షలుగా ప్రకటించడం విశేషం. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి దాఖలు చేసిన అఫిడవిట్ లో రాహుల్ తనకు 5.80 కోట్ల చరాస్తులున్నట్టు పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇన్ స్టూమెంట్స్ లో రూ.39.89లక్షలు, రూ.2.91 లక్షల విలువైన నగలు పేర్కొన్నారు. సోనియాగాంధీ మాత్రం ఈక్విటీ షేర్లు, మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. రాహుల్ మాత్రం మ్యుచ్ వల్ ఫండ్స్ కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.