Begin typing your search above and press return to search.
అక్కడ యువరాజు..ఇక్కడ ఫైర్ బ్రాండ్
By: Tupaki Desk | 29 Sep 2016 8:36 AM GMTఒకేరోజు దాదాపు కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ రాజకీయనాయకులు కోర్టుకు హాజరు కావటం గమనార్హం. నిజానికి ఈ ఇద్దరికి ఏ మాత్రం సంబంధం లేదు. వేర్వేరు కేసుల నేపథ్యంలో ఈ ఇద్దరు కోర్టుకు హాజరవుతున్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే.. మరొకరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి. స్థాయిల విషయంలో ఈ ఇద్దరికి ఎక్కడా సంబంధం లేకున్నా.. తెలుగు ప్రజలకు పరిచయం ఉన్న ఈ ఇద్దరూ ఒకే సమయంలో వేర్వేరు అంశాలపై న్యాయస్థానం ముందుకు హాజరయ్యారు.
గత ఏడాది డిసెంబరు 12న అసోం పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ షెడ్యూల్ లో భాగంగా 16వ శతాబ్దం నాటి బార్పెటా ఆశ్రమానికి వెళ్లి.. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొనాలి. అయితే.. ఆశ్రమానికి వెళ్లలేదు. ఎందుకిలా అని అడిగిన మీడియాకు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకున్నట్లుగా చెప్పారు. ఈ ఆరోపణల్ని ఖండించిన సంఘ్.. తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. దీంతో.. వారు గువాహటిలోని స్థానిక కోర్టులో పిటీషన్ వేశారు. విచారణలో భాగంగా రాహుల్ ను హాజరు కావాలని కోర్టు ఆదేశించటంతో ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. నోటి నుంచి వచ్చే మాట ఎలాంటి పరిస్థితికి కారణమవుతుందన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టు ఎదుట రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు ముడుపులు ఇచ్చిన ఉదంతంలో.. వీడియో టేపుతో దొరికినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి.. విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు సెబాస్టియన్ విచారణకు రాలేదు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 24కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/