Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరి తీయాలి?
By: Tupaki Desk | 13 Aug 2015 10:31 AM GMTలలిత్ మోదీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లడానికి లండన్ అధికారులకు సిఫార్సు చేసినందుకు సుష్మా స్వరాజ్ రూ.12 కోట్లు తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బహుశా దీనిని ఆమె భర్త లేదా కుమార్తె న్యాయవాదులు కనక వారి ఫీజుల రూపంలో తీసుకుని ఉండి ఉండవచ్చు. సుష్మ తప్పుచేసింది కనక ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలోనూ తప్పు లేదు. కానీ,
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలకు ఆ పార్టీ నేతలు ఎన్నిసార్లు రాజీనామాలు చేయాలి. అంత దారుణాలకు పాల్పడినందుకు ఎన్నిసార్లు ఉరి తీయాలి. రూ.12 కోట్లు కుంభకోణం అంటూ దానికి ఇంకా ఆధారాలు చూపకుండానే 15 రోజులుగా పార్లమెంటును స్తంభింపజేసి సోనియా సహా కాంగ్రెస్ నేతలంతా రోడ్డెక్కారు. మరి, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం 1,83,000 కోట్లు. బొగ్గు కుంభకోణం రెండు లక్షల కోట్ల రూపాయలు. కామన్ వెల్త్ కుంభకోణం 60 వేల కోట్ల రూపాయలు. ఆదర్శ్ ప్లాట్ల కుంభకోణం.. ఇలా పదేళ్లలో కుంభకోణాలకు లెక్కే లేదు. అంతకుముందు రాజీవ్ పాలన గురించి.. ఖత్రోకీ గురించి ఆండర్సన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం యూపీఏ హయాంలో హయాంలో జరిగిన కుంభకోణాలే దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయి. దీనికితోడు ఆ పార్టీ పాల్పడిన మరిన్ని దారుణాల లెక్కలు కూడా బయటకు తీస్తే యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా, ప్రధాని మన్మోహన్ సహా ఆ పార్టీ నేతలను ఎన్నిసార్లు జైలుకు పంపాలో. కానీ, కేవలం మిత్రపక్షాలను బలిపశువులను చేసి కాంగ్రెస్ నేతలు ఈ స్కాముల నుంచి తప్పించుకున్నారు.