Begin typing your search above and press return to search.
కేరళ వరదలపై మోదీకి రాహుల్ ట్వీట్!
By: Tupaki Desk | 18 Aug 2018 9:54 AM GMTవందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలు - వరదలు కేరళను ముంచెత్తడంతో అక్కడ భయానక పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గత 9 రోజులుగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద ఉధృతికి సుమారు 380 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా - 3.14లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఎన్డీఆర్ ఎఫ్ - ఆర్మీ - నేవీ - వాయు దళంతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ...వరద సహాయక చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ....ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. కేరళలో ప్రజల పరిస్థితి - భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని....లక్షలాది మంది ప్రజల జీవితాలు - జీవనోపాధి - భవిష్యత్ మోదీ చేతిలో ఉందని రాహుల్ అన్నారు.
మరోవైపు, కేరళలో వరదల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం కేరళలో పర్యటించిన సంగతి తెలిసిందే. కోచి నేవీ బేస్ నుంచి మోదీ ఏరియల్ సర్వే చేపట్టి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం - కేరళకు తక్షణ సాయం కింద రూ. 500కోట్లు ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ - ఇతర అధికారులతో మోదీ సమీక్ష జరిపి....వరద బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారికి కేంద్రం తరఫున రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు నష్టపరిహారం ఇస్తామన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నెల వేతనాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీంతోపాటు...కేరళ వరద బాధితులకు తెలంగాణ సీఎం కేసీఆర్ 25 కోట్లు - ఏపీ సీఎం చంద్రబాబు 10 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు - సినీ ప్రముఖులు - క్రీడాకారులు - సెలబ్రిటీలు.... కూడా కేరళ సీఎంఆర్ ఎఫ్ కు విరాళాలు ఇస్తున్నారు.