Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీ కిడ్నాప్!!
By: Tupaki Desk | 8 Jun 2017 10:47 AM GMT‘‘మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారు’’ కాంగ్రెస్ అగ్రనాయకత్వం వేస్తున్న ప్రశ్న ఇది. పోలీసుల అదుపులో ఉన్న రాహుల్ గాంధీని ఎవరికీ తెలియని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించినట్లు సమాచారం అందుకోవడంతో కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమ అగ్ర నేతను యూపీ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు.
రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ ప్రాంతాన్ని సందర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తలపెట్టిన పర్యటనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆ తరువాత ఆయన్ను రహస్య ప్రదేశానకి తరలించినట్లు తెలుస్తోంది.
తన పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. వారి కళ్లుగప్పి ఎలాగైనా మంద్ సౌర్ కు చేరుకొని.. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపాలని రాహుల్ భావించారు. కార్యకర్తల సాయంతో మంద్ సౌర్ కు చేరుకుంటుండగా మార్గమధ్యలో నీమూచ్ వద్ద పోలీసులు రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బలవంతంగా ఒక బస్సులోకి ఎక్కించి అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లారు.
కాగా మంద్ సౌర్ లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారంటూ మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే రాహుల్ అక్కడకు వెళ్లబోగా పోలీసులు ఆయన్ను సీను నుంచి తప్పించి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/