Begin typing your search above and press return to search.

ట్రోల్స్: రాహుల్ గాంధీ గడ్డం సీక్రెట్ ఏంటి?

By:  Tupaki Desk   |   15 Nov 2022 2:30 AM GMT
ట్రోల్స్: రాహుల్ గాంధీ గడ్డం సీక్రెట్ ఏంటి?
X
50 ఏళ్లకు చేరువ అవుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటున్నాడు. రెండుసార్లు అధికారంలోకి రాకపోయిన కాంగ్రెస్ ను ఈసారి ఎలాగైనా తేవాలన్న పట్టుదలతో కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో ఎదురీదుతోంది. కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపడుతున్నారు.

దిక్కుదిశ లేకుండా సాగుతున్న పార్టీని తిరిగి ఒక్కటి చేసి జవసత్వాలు నింపాలని.. పార్టీని తిరిగి పట్టాలెక్కించాలని కంకణం కట్టుకున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఒక్కటి చేస్తామన్న నినాదంతో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభించారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగి జమ్మూకశ్మీర్ లో ముగుస్తుంది.

మొత్తం 150 రోజుల పాటు సాగే ఈ యాత్రలో రాహుల్ మొత్తం 3500 కిలోమీటర్లు నడువనున్నారు. రాహుల్ యాత్ర ఉత్సాహంగా సాగుతున్న వేళ ఇప్పుడాయన గడ్డం ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ప్రధాన మీడియాలోనూ చర్చనీయాంశమైంది. రాహుల్ గడ్డంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇక రాజకీయాల్లో గడ్డం నాయకులెంతమంది ఉన్నారన్న చర్చను జాతీయ మీడియా అందుకుంది.

నిజానికి రాహుల్ మొదట గడ్డంతోనే కనిపించారు. ఆ తర్వాత నీట్ గా షేవ్ చేసుకొని స్మార్ట్ లుక్ లోకి మారారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్రలో గడ్డంతో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇదే ఆయనపై ట్రోల్స్ కు కారణమైంది. రాహుల్ 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ సినిమాలోని టామ్ హాంక్స్ స్ఫూర్తితోనే ఈ గడ్డం పెంచారని.. ఆయన అసలు సీక్రెట్ ఇదేనని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.