Begin typing your search above and press return to search.
రాహుల్ ప్రధాని కాలేడన్న ఆయన పిన్ని గారు!
By: Tupaki Desk | 6 April 2019 5:37 AM GMTరాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ వాళ్లు కష్ట పడుతూ ఉంటే… ఆయనకు అంత అవకాశం రాదని అంటోంది రాహుల్ కు స్వయానా పిన్ని అయిన మేనకాగాంధీ. దివంగత సంజయ్ గాంధీ సతీమణి అయిన మేనకాగాంధీకి సోనియాగాంధీకి మొదటి నుంచి పడదు అనే సంగతి తెలిసిందే. ఇందిరగాంధీనే వ్యతిరేకించి మేనక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తన భర్త మరణానంతరం ఆమె కాంగ్రెస్ కు పూర్తిగా దూరం అయ్యారు.
ఇక ఆ రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే సంజయ్- మేనకల తనయుడు వరుణ్ గాంధీతో మాత్రం సోనియా సంతానం సఖ్యతగానే కనిపిస్తూ ఉంటారు. సోదరుడితో వారు ఒకింత సత్సంబంధాలు నెరుపుతూ ఉంటారనే మాట వినిపిస్తూ ఉంటుంది.
అయితే వరుణ్ కూడా బీజేపీ లో ఉన్నాడు. ఎంపీగా కొనసాగుతూ ఉన్నారాయన. అయితే బీజేపీలో వరుణ్ కు తగిన అవకాశాలు దక్కలేదనే అభిప్రాయాలున్నాయి.
ఆ సంగతలా ఉంటే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడని మేనకాగాంధీ కుండబద్ధలు కొడుతున్నారు. రాహుల్ కు అంత చాతుర్యం లేదన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. అంతే కాదు.. ప్రియాంక గాంధీ పొలిటికల్ గ్లామర్ విషయంలో కూడా మేనక ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక ఎంట్రీతో పార్టీ దూసుకుపోతుందని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటుంటే.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని మేనక అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలపై ప్రియాంక ప్రభావం ఉండదని విశ్లేషించారు.