Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాహుల్‌

By:  Tupaki Desk   |   11 March 2018 4:47 AM GMT
నోట్ల ర‌ద్దుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాహుల్‌
X
అంత‌కంత‌కూ పెరుగుతున్న ప్ర‌ధాని మోడీ గ్రాఫ్ ను ఫ‌స్ట్ టైమ్ డౌన్ చేసిన అంశం ఏదైనా ఉందంటే.. అది పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశ‌మే. మొద‌ట సంచ‌ల‌న నిర్ణ‌యంగా.. మొన‌గాడి డెసీష‌న్ గా కీర్తించిన కోట్లాది మంది.. త‌ర్వాతి కాలంలో క‌స్సుమ‌నే ప‌రిస్థితి. కోట్లాది మందిని తీవ్ర ప్ర‌భావితం చేయ‌టంతో పాటు.. దేశ ఆర్థికస్థితిని ఒక కుదుపు కుదిపేసిన ఈ నిర్ణ‌యం చారిత్ర‌క త‌ప్పిదంగా అభివ‌ర్ణించే వారు చాలామందే క‌నిపిస్తారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు రాక‌పోగా.. దాని వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన తిప్ప‌లే త‌ప్పించి.. దేశానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. నిజానికి మోడీ గ్రాఫ్ డౌన్ కావ‌టం మొద‌లైందంటే.. అది పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాతేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పెద్ద నోట్ల ర‌ద్దుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ తాను ప్ర‌ధాని ప‌ద‌విలో ఉండి.. త‌న ద‌గ్గ‌ర‌కు పెద్ద‌నోట్ల ర‌ద్దు ఫైలు వ‌చ్చి ఉంటే.. మ‌రో ఆలోచ‌న లేకుండా చెత్త‌కుప్ప‌లో ప‌డేసి ఉండేవాడిన‌ని వ్యాఖ్యానించారు.

రూ.వెయ్యి.. రూ.500 నోట్ల ర‌ద్దు చ‌ర్య స‌రైన‌ది కాద‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌పై మీరెలా స్పందించి ఉండేవార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన రాహుల్‌.. త‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా ఆ ఫైల్ ను తీసుకొచ్చి ఉంటే.. వెంట‌నే తాను దానిని చెత్త‌బుట్ట‌లో విసిరేసి ఉండేవాడిన‌ని.. త‌లుపు అవ‌త‌ల‌కు ప‌డేసేవాడిన‌ని అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎప్ప‌టికి మంచిది కాద‌ని తేల్చిచెప్పారు.