Begin typing your search above and press return to search.
కేంద్రానికి ఇగో : దిగాలి మరి రాహుల్
By: Tupaki Desk | 3 Aug 2022 2:30 AM GMTకేంద్రానికి ఇగో అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ద్వజమెత్తారు. పాలకుల కళ్ళకు ఇగో గంతలు కట్టుకుని దేన్ని చూడలేని దుస్థితికి వచ్చారని ఫైర్ అయ్యారు. దేశంలో ద్రవ్యోల్బనం రేటు బాగా పెరిగిందని ఆయన అన్నారు. అలాగే అన్ని రకాలుగా దేశం ఇబ్బందులో ఉన్నా కూడా చూడలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని చెప్పుకొచ్చారు.
నిజమే. ఇవన్నీ నిజమే అనుకుందాం. మరి రాహుల్ గాంధీ చేస్తున్నది ఏమిటి. ఆయన ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధినాయకుడాయే. పైగా ఆయన ఎనిమిదేళ్ళుగా విపక్షంలో ఉన్నా అనుకున్న తీరున తన ఫైర్ ని ఎక్కడా చూపించలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కేవలం మాటలను అనేస్తూ టైమ్ పాస్ చేయడమే బీజేపీకి కడు ధైర్యాన్ని ఇస్తోందని చెప్పకతప్పదు.
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటే దాన్ని నిజం చేసేలా రుజువు చేసేలా అచేతానావస్థలో కాంగ్రెస్ ఉండడం కంటే దారుణం ఉంటుందా అన్న వారూ ఉన్నారు. జనంలోకి వచ్చి కాంగ్రెస్ చేసిన పోరాటాలు ఏవీ లేకపోవడం వల్ల కూడా బీజేపీ మరింతగా దూకుడు చేస్తోంది అన్న మాటా ఉంది.
ఇక రాహుల్ గాంధీ బాగానే మాట్లాడుతున్నారు. లాజిక్ పాయింట్స్ పట్టుకుని మరీ కడిగేస్తున్నారు. కానీ ఎంతసేపూ మీడియా ముందు గొంతు చించుకోవడం కాదు, జనాల్లోకి రావాలి.
ఉద్యమాలు చేయాలి. రాహుల్ చెప్పినట్లే ఈ రోజు దేశం ఆర్ధికంగా కడు సంక్షోభంలో ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీ విపక్షాలకు ఎన్నో అస్త్రాలను ఇస్తోంది. అయినా సరే మేము లేస్తే మనుషులం కామన్న తీరున మీడియా ముందున గర్జించడం తప్ప రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దలు చేసినది ఏమిటీ అన్న ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో రాహుల్ మాటలు కట్టిపెట్టి యాక్షన్ కి దిగాలి. నిజంగా రాహుల్ ఆరోపించినట్లుగా ఏలిన వారికి అహంకారపు పొరలు కమ్మి ఏదీ కనిపించకపోతే మాత్రం కొట్టుకుపోయేది నూటికి తొంబై శాతం పేదలే. మరి ఆ పేదల పక్షాన నిలిచి పోరాడాల్సిన బాధ్యత రాహుల్ సహా కాంగ్రెస్ వారికి లేదా అన్నదే ప్రశ్న. అందుకే అంతా రాహుల్ మాటలు చాలు ఇక ఫీల్డ్ లోకి దిగండని అంటున్నారు.