Begin typing your search above and press return to search.
తుగ్లక్ ‘లాక్డౌన్, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం తప్పా... నివారణ చర్యలేవీ
By: Tupaki Desk | 16 April 2021 12:30 PM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు వర్షం కురిపించారు. కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్రం తుగ్లక్ విధానాలను అవలంభిస్తుందని ఆరోపణలు చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు తుగ్లక్ లాక్ డౌన్, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి చేస్తోందని ఈ రోజు ట్వీట్ చేశారు. దేశంలో రికార్డు స్థాయిలో శుక్రవారం 2,17,353 కొవిడ్ కేసులు నమోదవగా, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 1.43 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే .. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, టీకా పంపిణీ, కేంద్రం నిర్ణయాలను చాలా సార్లు తప్పుపట్టింది. గతేడాది కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించడంతో పాటు, చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి కరోనా వారియర్స్‌కు మద్దతు నిలువాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా రాహుల్ కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో తీసుకున్న నిర్ణయంపై కూడా రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కేసులను నియంత్రించడంలో కేంద్ర వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఆయన ట్వీట్ చేశారు. ' కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19పై వ్యూహాత్మక ప్రణాళికలేంటంటే...దశ 1 : తుగ్లక్ లాక్‌డౌన్ విధించడం, దశ 2 : బెల్స్ మోగించడం : దశ 3 : దేవున్ని ప్రార్థించడం' అంటూ ట్వీట్ చేశారు.