Begin typing your search above and press return to search.

జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ!

By:  Tupaki Desk   |   30 May 2019 10:03 AM GMT
జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ!
X
ఒక వైపు రాజకీయ వైరాగ్యంలో కూరుకుపోయారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ వరసగా రెండో ఎన్నికల్లో చిత్తుగా ఓడటం, తను కూడా ఎంపీగా ఓడిపోవడంతో రాహుల్ గాంధీ బాగా అసహనానికి గురయ్యారు. ఆఖరికి రాజీనామాకు కూడా సిద్ధ పడ్డారు. ఇప్పటికే రాహుల్ రాజీనామాను టెండర్ చేశారు కూడా. అయితే కాంగ్రెస్ వాళ్లు ఆయనను కన్వీన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

రాజీనామా వద్దంటూ వారు ప్రాధేయపడుతూ ఉన్నారు. అయితే రాహుల్ మాత్రం వెనక్కు తగ్గేలా లేరు. ఆ సంగతలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని విష్ చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన అధికారిక ట్విటర్ అకౌంట్ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేశారు.

'కంగ్రాట్చులేషన్ జగన్ మోహన్ రెడ్డి జీ. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనకు శుభాకాంక్షలు, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు..' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన జగన్ ఇలా ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఇప్పుడు ఇలా అభినందిస్తూ ఉన్నారు!