Begin typing your search above and press return to search.

రాహుల్ టీంలో తెలుగు రాష్ట్రాల‌కు నో ప్లేస్‌!

By:  Tupaki Desk   |   18 July 2018 3:30 AM GMT
రాహుల్ టీంలో తెలుగు రాష్ట్రాల‌కు నో ప్లేస్‌!
X
రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేత‌ల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. విభ‌జ‌న నిర్ణ‌యంతో ఏపీలో పార్టీ నామ‌రూపాల్లేకుండా పోతే.. తెలంగాణ‌లో అంతో ఇంతో అన్న‌ట్లుగా ఉంది. కేసీఆర్ లాంటి బ‌ల‌మైన అధినేత దెబ్బ‌కు విల‌విల‌లాడుతున్న పార్టీ నేత‌లు.. అధికారంలోకి వ‌చ్చే కంటే.. త‌మ‌లో తాము కొట్టుకోవ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న వైనం త‌ర‌చూ చూస్తున్న‌దే.

ఇదిలా ఉంటే.. ఈ కుమ్ములాట‌లు మ‌రింత పెర‌గ‌కూడ‌ద‌నుకున్నారో.. లేక‌.. వీటిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారో కానీ.. రాహుల్ తాజా సీడ‌బ్ల్యూసీ లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఏ ఒక్క‌ కాంగ్రెస్ నేత‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ ప‌గ్గాలు స్వీక‌రించిన త‌ర్వాత ఏర్ప‌డిన తొలి సీడ‌బ్ల్యూసీ ఇదే కావ‌టం విశేషం.

తాజాగా ఏర్ప‌డిన సీడ‌బ్ల్యూసీని చూస్తే.. ఇందులో 23 మంది స‌భ్యులు.. 18 మంది శాశ్వత ఆహ్వానితులు.. తొమ్మిది మంది ప్ర‌త్యేక ఆహ్వానితుల‌కు చోటు క‌ల్పించారు. సీడబ్ల్యూసీ కూర్పు చూస్తే.. సీనియ‌ర్లు.. యువ‌త‌.. లాంటి వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

అదే స‌మ‌యంలో.. కొంద‌రు సీనియ‌ర్ల‌కు షాకిస్తూ.. వారికి చోటుకు కల్పించ‌లేదు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ నేత‌ల‌కు చోటు ద‌క్క‌కున్నా.. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ‌ల‌కు సంబంధించిన ఒక‌రికి మాత్రం ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా స్థానం ల‌భించ‌టం గ‌మ‌నార్హం.

ఢిల్లీలో తాజాగా నిర్వ‌హించిన స‌మావేశానికి అన్ని రాష్ట్రాల అధ్య‌క్షుడు.. శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ల్ని ఆహ్వానించారు. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేత‌ల్లో ఏ ఒక్క‌రికి స్థానం ల‌భించ‌క‌పోవ‌టం ఊహించ‌లేని అంశంగా చెబుతున్నారు. అయితే.. పొర‌పాటు కార‌ణంగా సీడ‌బ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నేత‌ల‌కు స్థానం ల‌భించ‌లేద‌ని.. దాన్ని త్వ‌ర‌లోనే స‌రి చేస్తామ‌న్న మాట వినిపిస్తోంది. పొరపాటుతో జ‌రిగిన త‌ప్పును స‌రి చేస్తామ‌ని చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ అధ్య‌క్షుడి హోదాలో సంజీవ‌రెడ్డికి ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా స్థానం ల‌భించింది. సీడ‌బ్ల్యూసీ తొలి స‌మావేశాన్ని జులై 22 న నిర్వ‌హించాల‌ని రాహుల్ డిసైడ్ చేశారు.

23 మంది సీడ‌బ్ల్యూసీ స‌భ్యుల‌ను చూస్తే...

1.రాహుల్‌ గాంధీ
2. సోనియా గాంధీ
3. మన్మోహన్‌ సింగ్‌
4.మోతీలాల్‌ వోరా
5.గులాం నబీ ఆజాద్‌
6.మల్లికార్జున్‌ ఖర్గే
7.ఏకే ఆంటోనీ
8.అహ్మద్‌ పటేల్‌
9.అంబికా సోని
10.ఊమెన్‌ చాందీ
11.తరుణ్‌ గొగోయ్‌
12.సిద్దరామయ్య
13.ఆనంద్‌ శర్మ
14.హరీశ్‌ రావత్‌
15.కుమారి సెల్జా
16.ముకుల్‌ వాస్నిక్‌
17.అవినాశ్‌ పాండే
18.కేసీ వేణుగోపాల్‌
19.దీపక్‌ బాబారియా
20.తామ్రద్వాజ్‌ సాహు
21. రఘువీర్‌ మీనా
22.గైకాంగమ్‌ గాంగ్మె
23.అశోక్‌ గెహ్లాట్‌

శాశ్వత ఆహ్వానితులుగా ఎంపికైన18 మందిలో..

1.షీలా దీక్షిత్‌
2.పి.చిదంబరం
3.జ్యోతిరాదిత్య సింధియా
4. బాలసాహెబ్‌ థోరాట్‌
5.తారిక్‌ హమీద్‌ కర్రా
6.పీసీ చాకో
7.జితేంద్రసింగ్‌
8.ఆర్‌ పీఎన్‌ సింగ్‌
9.పీఎల్‌ పూనియా
10.రణదీప్‌ సుర్జేవాలా
11.ఆశాకుమారి
12.రజనీ పాటిల్‌
13.ఆర్‌సీ కుంతియా
14.అనుగ్రహ నారాయణ్‌ సింగ్‌
15.రాజీవ్‌ ఎస్‌ సాతవ్‌
16.శక్తిసిన్హా గోహిల్‌
17.గౌరవ్‌ గొగోయ్‌
18.ఎ.చెల్లాకుమార్‌

పార్టీ ప్ర‌త్యేక‌ ఆహ్వానితులుగా 9 మందిని ఎంపికయ్యారు వారిలో..

1.కేహెచ్‌ మునియప్ప
2.అరుణ్‌ యాదవ్‌
3.దీపేందర్‌ హుడా
4.జితిన్‌ ప్రసాద్‌
5.కుల్దీప్‌ బిష్ణోయ్‌
6. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవ‌రెడ్డి
7.ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు
8. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు
9. సేవాదళ్‌ ప్రధాన నిర్వాహకుడు.

సీడ‌బ్ల్యూసీలో స్థానం కోల్పోయిన నేత‌ల్లో..

1.దిగ్విజయ్‌ సింగ్
2.జనార్దన్‌ ద్వివేది
3.కమల్‌నాథ్
4.సుశీల్‌కుమార్‌ షిండే
5.కరణ్‌సింగ్
6.పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్
7.హ‌ర్యాణ మాజీ సీఎం భూపిందర్‌ హుడా
8.హిమాచల్‌ మాజీ సీఎం వీరభద్రసింగ్
9.సీనియర్‌ నాయకులు మోహన్‌ ప్రకాశ్
10.ఆస్కార్‌ ఫెర్నాండెజ్
11.సీపీ జోషి
12.కిద్వాయ్‌