Begin typing your search above and press return to search.

మోడీ-అమిత్ షా త‌ప్ప అంతా జంతువులమే-రాహుల్

By:  Tupaki Desk   |   8 April 2018 6:39 AM GMT
మోడీ-అమిత్ షా త‌ప్ప అంతా జంతువులమే-రాహుల్
X
కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగాల్లో వాడి వేడి పెంచుతున్నారు. అవ‌కాశం దొరికితే చాలు అధికార ప‌క్షాన్ని ఓ ఆట ఆడుకుంటున్న రాహుల్ తాజాగా అదే రీతిలో మ‌రో పంచ్ వేశారు. బీజేపీ ర‌థసార‌థులు...స‌ర్వం తామే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ - అమిత్‌ షాల‌కు అదిరిపోయే పంచ్ వేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విపక్షాలను జంతువులతో పోల్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఆ ఇద్ద‌రు త‌ప్ప అంతా జంతువులేన‌ని వ్యాఖ్యానించారు.

అమిత్ షా కు విపక్షాలంటే గౌరవం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీడియాతో అన్నారు. అమిత్ షా దేశంలోని విపక్ష పార్టీలని జంతువులతో పోల్చారు. దేశంలో ఇద్దరు మాత్రమే జంతువు లు కాదని అమిత్ షా - బీజేపీ/ఆరెస్సెస్ భావిస్తున్నాయి. వారి దృష్టిలో ఆ ఇద్దరెవరంటే ప్రధాని మోడీ, అమిత్ షా. వారే ఏ పనైనా చేయగలరు. మిగతా వారు... దళితులు - గిరిజనులు - మైనారిటీలు చివరికి బీజేపీ నేతలు అద్వానీ - ఎంఎం జోషి - గడ్కరీ కూడా చేతగానివారే` అంటూ ఆ ఇద్ద‌రు నేత‌లు అవాక్క‌య్యే మాట‌లు అన్నారు. అమిత్ షా మాటలను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రాహుల్ ముక్తాయించారు.

ఇదే సంద‌ర్భంగా అవినీతిపైనా రాహుల్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. దాదాపు 100 యుద్ధ విమానాల కొనాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ ధ్వజమెత్తారు. మోడీ స్కాం అలర్ట్. రూ. 97,387 కోట్లతో దాదాపు 100 యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధాని తన స్నేహితుల కోసం మరో టెండర్‌ను తీసుకొచ్చారు అని రాహుల్ దుయ్య‌బ‌ట్టారు.