Begin typing your search above and press return to search.

ఆదివాసీలతో కలిసి అదిరి పోయే స్టెప్పులేసిన రాహుల్ గాంధీ !

By:  Tupaki Desk   |   27 Dec 2019 10:07 AM GMT
ఆదివాసీలతో కలిసి అదిరి పోయే స్టెప్పులేసిన రాహుల్ గాంధీ !
X
నేషనల్ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్‌ లో పర్యటిస్తున్నారు. ఈ తరుణం లో ఛత్తీస్‌గఢ్‌ లో జాతీయ ఆదివాసీ నృత్య వేడుకలు అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. దీనితో రాయ్‌ పూర్‌ లో జరిగిన ఈ రాష్ట్రీయ ఆదివాసీ నృత్య మహోత్సవానికి హాజరయ్యి .. వేడుకలను ప్రారంభించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమం లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్‌ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీ గెటప్‌ లో తలపై స్పెషల్ టోపీ, మెడలో డోలుతో గిరిజనుల తో కలిసి. స్టెప్పులేశారు. కాగా, ఈ ఆదివాసీ నృత్యోత్సవ వేడుకలకు 25 రాష్ట్రాల్లోని ఆదివాసీల తో పాటు గా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1200 మంది గిరిజన నృత్య కళాకారులు పాల్గొంటున్నారు. అంతేకాదు.. శ్రీలంక, ఉగాండా, బెలరస్, మాల్దీవులు, థాయిలాండ్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ట్రైబల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ గిరిజనులు గుస్సాడీ నృత్యాన్ని, ఏపీ గిరిజనులు థింసా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. మొదటి స్థానం లో నిలిచిన బృందానికి రూ. 20 లక్షల బహుమతి, రెండో స్థానం లో నిలిచిన బృందానికి రూ. 12 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బృందానికి రూ. 8 లక్షల బహుమతి ఇవ్వనున్నారు.