Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అజెండాలో... హిందు ర‌క్ష‌ణ‌!

By:  Tupaki Desk   |   2 Nov 2018 3:30 PM GMT
కాంగ్రెస్ అజెండాలో... హిందు ర‌క్ష‌ణ‌!
X
దేశంలో ఇపుడు కొత్త రాజ‌కీయం క‌నిపిస్తోంది. దేవుడ్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన క‌మ్యూనిస్టులు కాల‌క్ర‌మేణా ప‌త‌నం అయిపోగా... దాన్ని చూసిన కాంగ్రెస్ జ‌డుసుకుంది. ఎక్క‌డికక్క‌డ ముస్లిం ఓట్లు ద‌క్కించుకోవ‌డానికి ప్రాంతీయ పార్టీలు భారీగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో ఇపుడు క‌నుక దేవుడు విష‌యంలో మ‌న విధానం మార్చుకోక‌పోతే చాలా క‌ష్ట‌మ‌ని కాంగ్రెస్ పార్టీ ఫిక్స‌యి పోయింది. అందుకే ఇపుడది ముస్లింలను నెత్తికెత్తుకొనే వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటోంది.

గ‌త గుజ‌రాత్ ఎన్నిక‌లు మొద‌లు కాంగ్రెసు పార్టీ సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ తీసుకుంది. రాహుల్ గాంధీ అవ‌కాశం దొరికితే చాలు అభిషేకాలు చేయిస్తున్నారు. దేవుడే దిక్కంటూ వార‌స‌త్వంగా రాని హిందూ సోద‌రుల ప్రేమ‌ను ఎగ‌రేసుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ఇపుడిపుడే బీజేపీకి మాయ‌మాట‌లు అర్థ‌మ‌య్యే వ‌ర్గం మొద‌టిసారి దేవుడి వైపు చూస్తున్న త‌మ‌ను న‌మ్ముతుంద‌న్న‌ది కాంగ్రెస్ అభిప్రాయం. పైగా ప్రాంతీయ పార్టీలతో భారీ సంకీర్ణం ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో హిందుత్వ స్టాండ్ విష‌యంలో ఆ పార్టీకి మ‌రింత మ‌ద్ద‌తు దొరికింది.

ఇటీవ‌ల సుప్రీంకోర్టు తీర్పు సంద‌ర్భంగా అయ్యప్పస్వామి సన్నిధి విషయంలో ప్రజల మనోభావాలకే తమ ఓటు అంటూ పార్టీ వైఖరిని ప్రకటించింది. లౌకికంగా గోడ‌మీద పిల్లిలా ప్ర‌వ‌ర్తించ‌లేదు. కానీ అక్క‌డ ఆ సెంటిమెంట్‌ ను త‌న్నుకుపోతున్న బీజేపీకి గ‌ట్టి పోటీయే ఇస్తోంది కాంగ్రెస్‌. అంతేకాకుండా రాహుల్ గాంధీ తాను శివభక్తుడినని చెప్పుకుంటున్నారు. అవ‌కాశం కుదుర్చుకుని మ‌రీ టెంపుల్ రన్ ప్రారంభించారు. గుడులు - గోపురాలు తిరగడంలో రాహుల్ తో కాంగ్రెస్‌ నాయకులు పోటీలు పడుతున్నారు. గతంలో మైనారిటీ - ఎస్సీ - ఎస్టీ ఓట్లు సంఘటితమైతే చాలనుకునే దశ నుంచి హిందూ ఓట్లను సాధించకపోతే భవిష్యత్తు లేద‌న్న విష‌యాన్ని కాంగ్రెస్ గ్ర‌హించింది. దీనికి కార‌ణం...కేవ‌లం హిందుత్వ ఓట్లతో నే సంపూర్ణ మెజారిటీ సాధించొచ్చ‌ని విష‌యాన్ని బీజేపీ నిరూపించ‌డం. మొత్తమ్మీద 2019 రాజకీయ సమీకరణల్లో మతం ఓ పెద్ద పాయింట్‌. ముఖ్యంగా కాంగ్రెస్ అజెండాలో హిందుమ‌తం చేర‌డం ఇక్క‌డ హైలెట్‌.