Begin typing your search above and press return to search.

55 ఏళ్ల‌కే క‌టాఫ్.. డిసైడ్ చేసిన యువ‌రాజు?

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:28 AM GMT
55 ఏళ్ల‌కే క‌టాఫ్.. డిసైడ్ చేసిన యువ‌రాజు?
X
కొత్త నీరు దూసుకొస్తున్న‌ప్పుడు పాత‌నీరు ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందే. త‌ప్పుకోకున్నా.. వాటిని త‌న‌తో తీసుకెళ్లి.. పాత నీటికి ఉనికి లేకుండా చేయ‌టం కామ‌నే. ఇప్పుడు అలాంటి మార్పే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోనుంద‌ని చెబుతున్నారు. పార్టీని మ‌రింత దూకుడుగా త‌యారు చేసుకునేందుకు రాహుల్ దృష్టి ఇప్పుడంతా యూత్ మీద‌నే ఉంద‌ని చెబుతున్నారు.

క‌త్తుల్లాంటి యూత్ ఫోర్స్ కు మాత్ర‌మే టికెట్లు అని.. ముస‌లి వాస‌న‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయ‌న డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో పోటీకి 55 ఏళ్లు క‌టాఫ్ గా పెట్టుకున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌ట‌మేకాదు.. సానుకూల ఫ‌లితాలు పొందుతున్న వేళ‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ త‌ర‌ఫు బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల వ‌య‌సు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 55 ఏళ్ల‌కు మించి ఉండ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పార్టీ ప‌గ్గాలు ఇటీవ‌ల చేప‌ట్టిన నేప‌థ్యంలో.. పార్టీ త‌ర‌ఫు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల వ‌య‌సు విష‌యంలో రాహుల్ స్ప‌ష్ట‌త‌తో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి ఒత్తిళ్ల‌కు లొంగ‌కూడ‌ద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ‌.. 55 ఏళ్లు దాటినా ఉత్సాహంతో ప‌ని చేస్తుంటే.. వారిని ప్ర‌త్యేకంగా గుర్తించి.. గౌర‌వించాలే త‌ప్పించి పోటీలోకి దించ‌టం మాత్రం ఉండ‌ద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

బీజేపీకి ఏ విధంగా అయితే సంఘ్ ప‌రివార్ లాంటి బ్యాక‌ప్ సెట‌ప్ ఉందో.. ఇంచుమించు అదే తీరును కాంగ్రెస్ లోనూ సెట‌ప్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో రాహుల్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. చురుకైన వారికి మాత్ర‌మే పార్టీలో స్థానం క‌ల్పించాల‌ని.. దూసుకెళ్లే త‌త్త్వం ఉండి.. ప్ర‌జాద‌ర‌ణ విష‌యంలో ట్రాక్ రికార్డు ఉన్న వారికి మాత్ర‌మే అవ‌కాశాలు ఇచ్చే విష‌యంపై రాహుల్ సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాను న‌మ్మిన విధానాన్ని ఈ మ‌ధ్య‌న జ‌రిగిన పంజాబ్‌.. గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొంత మేర అమ‌లు చేసి సానుకూల ఫ‌లితాలు పొందారు.

ఈ నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వారి విష‌యంలో కొంత క‌ఠినంగా ఉండాల‌ని రాహుల్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వారికి 55 ఏళ్ల క‌టాఫ్ అని చెప్ప‌టమంటే సీనియ‌ర్ల‌ను చిన్న‌బుచ్చ‌టం ఎంత‌మాత్రం కాద‌ని.. వారికి స‌ముచిత‌మైన స్థానం క‌ల్పిస్తూనే.. కొత్త ర‌క్తానికి కీల‌క‌బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రాహుల్ మైండ్ సెట్ గురించి తెలిసిన కాంగ్రెస్ సీనియ‌ర్లు వ‌ణికిపోతున్నారు. 55 ఏళ్లు అన్న‌ది పెద్ద వ‌య‌సు కాద‌ని.. కానీ.. ఆ వ‌య‌సుకే నేత‌ల్ని ప‌క్క‌న పెట్టాల‌ని భావించ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లో ఉన్న అంశం రేపు తెలంగాణ‌లో పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తే సీనియ‌ర్ నేత‌ల‌కు భారీ షాక్ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు.