Begin typing your search above and press return to search.

ఆమె అడిగింది..రాహుల్ తండ్రి గోత్రం చెప్తారా?

By:  Tupaki Desk   |   28 Nov 2018 10:18 AM GMT
ఆమె అడిగింది..రాహుల్ తండ్రి గోత్రం చెప్తారా?
X
సుదీర్ఘ కాలం త‌ర్వాత త‌న వ్య‌క్తిగ‌త అంశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ అంశాన్ని వెల్ల‌డించారు. ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజీబిజీగా గ‌డుపుతున్న తాజాగా త‌న వ్య‌క్తిగ‌త అంశానికి సంబంధించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌స్థాన్‌ లో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న రాహుల్‌... పుష్క‌ర్‌ లోని ప్ర‌ముఖ‌ బ్ర‌హ్మ ఆల‌యానికి వెళ్లారు. అక్క‌డ పూజ‌లు నిర్వ‌హించిన రాహుల్‌.. త‌న కుల - గోత్రాల‌ను వెల్ల‌డించారు. అయితే, దీనిపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే - కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇటీవల రాహుల్ చాలా వ‌ర‌కు ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. దానిలో భాగంగా ఉజ్జ‌యినిలోని మ‌హాకాలేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌లు రాహుల్‌ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాహుల్ త‌న గోత్రం ఏంటో వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ రాహుల్ త‌న గోత్రాన్ని వెల్ల‌డించారు. పుష్క‌ర్‌ లోని బ్ర‌హ్మ దేవుడి ఆలయంలోకి వెళ్లిన సంద‌ర్భంగా పూజారి అడిగిన స‌మ‌యంలో త‌న‌ది ద‌త్తాత్రేయ గోత్ర‌మ‌ని - కౌల్ బ్ర‌హ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ట్లు రాహుల్ తెలిపారు. పూజ స‌మ‌యంలో త‌న పితృమూర్తుల కుల‌గోత్రాల‌ను కూడా వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ బ్ర‌హ్మ ఘాట్ వ‌ద్ద పూజ‌లు నిర్వ‌హించారు. అంత‌కుముందు స్థానిక నేత‌లు రాహుల్‌ కు కాషాయం కండువాను క‌ట్టారు. టెంపుల్ రిజ‌స్ట‌ర్‌ లో జై హింద్‌ - వందేమాతం అని కూడా రాశారు. పితృదేవ‌త‌ల‌కు త‌ర్ప‌ణం ఇస్తున్న స‌మ‌యంలో అక్క‌డ ఉన్న జ‌నం జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. బ్ర‌హ్మ ఆల‌యాన్ని గ‌తంలో మాజీ ప్ర‌ధాని నెహ్రూ - ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీ - సోనియా గాంధీలు కూడా విజిట్ చేశారు.

బ్ర‌హ్మ ఆల‌య ద‌ర్శ‌నం త‌ర్వాత రాహుల్త‌న గోత్రం వెల్ల‌డించ‌డంపై వ‌సుంధ‌రా రాజే సింధియా స్పందిస్తూ రాహుల్‌ అబ‌ద్దాలు ఆడిన‌ట్లు మండిప‌డ్డారు. ‘రాహుల్‌ తన గోత్రం ఏంటో చెప్పలేదు. ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్‌ తన తండ్రి రాజీవ్‌ గాంధీ, తాత ఫిరోజ్‌ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’ అని రాజే వ్యాఖ్యానించారు.