Begin typing your search above and press return to search.
మనకు రాహుల్ ఇచ్చిన మొదటి షాక్
By: Tupaki Desk | 17 Feb 2018 7:27 AM GMTకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం అధిరోహిస్తుండగానే...మన తెలుగునేలకు చెందిన హస్తం పార్టీ నేతలు వ్యక్తం చేసిన సంతోషాలు గుర్తుండే ఉంటుంది. వారసత్వానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీలో...యువరాజు పీఠం ఎక్కుతున్నప్పటికీ...ఆ పరిణామాన్ని చరిత్రాత్మక ఘట్టంగా కొందరు నేతలు అభివర్ణించారు. తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత రాహుల్ తెలుగు రాష్ర్టాల్లో పర్యటించనున్నారని లీకులు ఇవ్వడమే తప్ప వచ్చింది లేదు...ఈ పరిణామమే కాంగ్రెస్ నేతలను ఒకింత అసంతృప్తికి గురిచేస్తుండగా.. తాజాగా రెండు రాష్ర్టాలలోని పార్టీ నేతలకు రాహుల్ తన మార్క్ షాక్ ఇచ్చారని అంటున్నారు.
ఇంతకీ ఇదంతా దేని గురించి అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత అత్యున్నత నిర్ణయాక వేదిక అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) గురించి. ఏఐసీసీలో అత్యున్నత నిర్ణాయిక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేశారు. దాని స్థానంలో 34మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని నియమించారు. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలను ఈ కమిటీ సారధ్యంలో నిర్వహించనున్నారు. పార్లమెంటులో బడ్జెట్ పై మలి విడత చర్చ మొదలయ్యేలోగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారని భావిస్తున్నారు. కాగా ప్లీనరీని ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని నిర్ణయించేందుకు శనివారం సాయంత్రం 4 గంటలకు స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. ప్లీనరీ సమావేశాలు పూర్తయ్యాక కొత్త సీడబ్ల్యూసీని ప్రకటిస్తారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలో కొనసాగుతారు. అయితే సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుల్లో అమరీందర్ సింగ్ - విలాస్ ముత్తెంవార్ - ఆర్ కే ధావన్ - శివాజీరావ్ దేశ్‌ముఖ్ - ఎంవీ రాజశేఖరన్ - మొహిసినా కిద్వాయ్ లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులలో ఎవ్వరికీ ఈ కమిటీలో చోటు కల్పించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక సహా పార్టీ సంస్థాగత ఎన్నికల ముగింపుపై స్టీరింగ్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలో 25మంది సభ్యులుంటారు. అధ్యక్షుడు - కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ తోపాటు 12మంది ఎన్నికైన ప్రతినిధులు - 11 మంది నామినేటెడ్ సభ్యులు ఇందులో ఉంటారు. కొత్తగా ఏర్పాటు చేసే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులను ప్లీనరీ సమావేశాల్లోగానీ - ఆ తరువాతగానీ ఎన్నుకుంటామని - అంతవరకు స్టీరింగ్ కమిటీ ప్లీనరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ర్టాలకు ఏ ఒక్క నేతకు చాన్స్ కల్పించకపోవడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మన రాష్ర్టాలపై ఉన్న శ్రద్ధకు ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.