Begin typing your search above and press return to search.
రాహుల్ వైరల్ ఫీవర్ కు మోడీ పరామర్శ
By: Tupaki Desk | 16 May 2016 1:38 PM GMTతమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా ఉంటుంది ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారం. ఓపక్క రాజకీయంగా కోలుకోలేనట్లుగా దెబ్బ కొడుతూనే.. మరోవైపు తన ప్రత్యర్థికి ఏదైనా వ్యక్తిగత సమస్య వస్తే వెంటనే స్పందించే తీరు మోడీలో కనిపిస్తుంది. నిత్యం తనను విమర్శలతో సతాయించే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడటం చూసిన మోడీ.. ఆయనకు అవసరమైన వైద్యాన్ని సూచించటమే కాదు.. అది తగ్గేలా సలహా ఇవ్వటాన్ని మర్చిపోలేం.
తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రమైన హై వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు. గత గురువారం నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న రాహుల్.. అనారోగ్యం కారణంగా పుదుచ్చేరి ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవటం తెలిసిందే. రోజులు గడుస్తున్నా రాహుల్ జ్వరం తగ్గకపోవటంపై తాజాగా ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేయటమే కాదు..తాజాగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటమేకాదు.. రాహుల్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ఆకాంక్షించినట్లుగా ఆరోగ్య శాఖామంత్రి జేపీనడ్డా వెల్లడించారు. రాహుల్ హై ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని.. ఆయన్ను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా నడ్డా వెల్లడించారు. రాహుల్ ఆరోగ్యానికి సంబందించిన అప్ డేట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా.. కేంద్రప్రభుత్వం ఇవ్వటం కాస్త చిత్రంగా లేదు?