Begin typing your search above and press return to search.
సోనియా ప్రమాణం చేస్తుంటే రాహుల్ అలా చేశారు!
By: Tupaki Desk | 19 Jun 2019 4:55 AM GMTయూపీఏ ఛైర్ పర్సన్.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాయబరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియాగాంధీ తన ప్రమాణస్వీకారోత్సవాన్ని హిందీలో చేశారు.
తల్లి ప్రమాణస్వీకారోత్సవాన్ని రాహుల్ తన మొబైల్ ఫోన్ లో ఫోటోలు తీసుకోవటం అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. గతంలో ఎప్పుడూ రాహుల్ ఇలా చేసింది లేదు. తొలిసారి తన తల్లి ప్రమాణస్వీకారాన్ని మొబైల్ లో ఫోటో తీయటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. సోనియాగాంధీ తర్వాత ఎంపీగా మేనకాగాంధీ చేయాల్సి వచ్చింది. ప్రమాణం చేసి తిరిగి వస్తున్న సోనియాగాంధీకి బీజేపీ ఎంపీ.. తన భర్త సోదరుడి భార్య అయిన మేనక ఎదురుపడటంతో ఒకరికొకరు ముకిళిత హస్తాలతో అభివాదం చేసుకున్నారు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య మాటలు లేకపోవటం తెలిసిందే.
మంగళవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ములాయింసింగ్ యాదవ్ వీల్ చైర్ లోనే ప్రమాణం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల కారణంగా అందుకు అనుమతించారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ తన ప్రమాణాన్ని సంస్కృతంలో చేశారు. హైదరాబాద్ ఎంపీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేసే వేళలో జైశ్రీరాం.. భారత్ మాతాకీ జై.. ఇలాంటి నినాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. విపక్ష నేతల్లో అసద్ ప్రమాణం చేసే వేళలో అధికారపక్షం నుంచి నినాదాల జోరు ఎక్కువగా వినిపించటం గమనార్హం.