Begin typing your search above and press return to search.

గంగానదిలో శవాలపై రాహుల్ గాంధీ ఎమోషనల్

By:  Tupaki Desk   |   24 May 2021 6:30 AM GMT
గంగానదిలో శవాలపై రాహుల్ గాంధీ ఎమోషనల్
X
కరోనా కోరలు చాస్తోంది. యూపీలో అయితే వేల మందికి సోకి వందల మంది ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ మీదుగా వెళ్లే గంగానదిలో ఇటీవల కొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. 100 వరకు శవాలను గంగానదిలో పడేశారు.

గ్రామాల్లో, పట్టణాల్లో అంత్యక్రియలకు చోటు లేక కొందరు.. కోవిడ్ మృతదేహాలను ఎవరూ తీసుకుపోకపోవడంతో మరికొందరు ఇలా పవిత్ర గంగానదిలో మృతదేహాలు వదిలేసి ఉంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా అందరినీ శోకసంద్రంలో ముంచింది.

ఈ గంగానదిలో మృతదేహాలపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘గంగానదిలో మృతదేహాల ఫొటోలు షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఫొటోలను దేశం చూసింది. కానీ నది ఒడ్డున ఆత్మీయుల శవాలను వదిలివెళ్లే వారి మనోవేదనను మనం అర్థం చేసుకోవాలి అని రాహుల్ ఎమోషనల్ అయ్యారు.

గంగానదిలో శవాలను వదిలేయడం వారి తప్పు కాదు.. దీనికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి అని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఖననానికి కూడా స్థలాలు లేని పరిస్థితి.. కోవిడ్ విజృంభణ.. చర్యలు తీసుకోవడంలో విఫలమైన కేంద్రమే దీనికి బాధ్యత అని రాహుల్ మండిపడ్డారు. నదిలో కరోనా మృతదేహాలు వదిలేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.