Begin typing your search above and press return to search.

భారత్ బంద్: రాహుల్ సపోర్టు.. బెంగాల్ లో ఉద్రిక్తం

By:  Tupaki Desk   |   8 Jan 2020 5:13 AM GMT
భారత్ బంద్: రాహుల్ సపోర్టు.. బెంగాల్ లో ఉద్రిక్తం
X
దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ ఉధృతంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ రోజు భారత్ బంద్ దేశవ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ బంద్ లో దాదాపు 25కోట్ల మంది పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ లో భారత్ బంద్ హింసాత్మకం గా మారింది. అక్కడ రోడ్డు, రైలు మార్గాలపై కార్మికులు భైటాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, కార్మికులు బెంగాల్ లో భారీ ర్యాలీలు తీస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేయించారు. రోడ్లు, రైళ్లను దిగ్బంధించారు. దీంతో ఉత్తర బెంగాల్ లోని 24 ప్రజ్ఞాస్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోల్ కతా లో ర్యాలీని పోలీసులు అడ్డుకొని లాఠీచార్జి చేశారు. విజయవాడ, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా కార్మికుల భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూత పడ్డాయి.

ఈ భారత్ బంద్ కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారు. మోడీ-అమిత్ షాల ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక రాజకీయాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న భారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కార్మికుల హక్కులు నెరవేరాలని.. మోడీ పెట్టుబడిదారి, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.