Begin typing your search above and press return to search.
సావర్కర్ పేరు పలికిన రాహుల్ కు భారీ పంచ్ లు
By: Tupaki Desk | 15 Dec 2019 7:20 AM GMTభారీగా వచ్చే మైలేజీని ఒక పేరు పలికి పోగొట్టుకుంటారా? అంటే నో చెప్పేస్తారు ఎవరైనా. కానీ.. రాహుల్ గాంధీ అందుకు భిన్నం. అవసరం లేని చోట అనవసర ప్రస్తావనల్ని తీసుకొచ్చి ఇష్యూను పక్కదారి పట్టేలా చేయటమే కాదు.. కొన్ని వర్గాల చేత వేలు చూపించుకునేలా చేస్తారు. మోడీని టార్గెట్ చేసే క్రమంలో పలువురు తనను లక్ష్యం చేసుకునేలా ఆయన మాటలు ఉంటాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
రాహుల్ లక్ష్యం మోడీ అయినప్పుడు.. సూటిగా దాని మీదే ఫోకస్ చేయకుండా సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చి ఇష్యూను మరో తీరుకు వెళ్లేలా చేయటం గమనార్హం. తాజాగా కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని విజయవంతంగా తీసుకొచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించిన ఒక భారీసభను ఢిల్లీలో నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో పౌరసత్వ సవరణ చట్టం మీదనే ఉండాలే తప్పించి.. ఇష్యూ పక్కకు వెళ్లే వ్యాఖ్యలు చేయకూడదు.
కానీ.. రాహుల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని.. రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. సావర్కర్ పేరును ప్రస్తావించటం ద్వారా కొందరి మనసుల్ని దోచుకోవటంతో పాటు బీజేపీకి మంట పుట్టేలా చేయొచ్చని ఆయన ఆశించి ఉంటారు. కానీ.. రాహుల్ మిస్ అవుతున్న పాయింట్.. ఆయన్ను అభిమానించే వారు.. సానుభూతిపరులు తనకు దూరమవుతాయన్నది ఆయన ఆలోచించినట్లుగా కనిపించట్లేదు.
సావర్కర్ ప్రస్తావన తేవటంపైన పలువురు మండిపడుతున్నారు. ఎక్కడి దాకానో ఎందుకు కాంగ్రెస్ అభయంతో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న శివసేన సైతం రాహుల్ వ్యాఖ్యలపై కయ్యిమంది. తాజాగా రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పు పట్టారు. దేశ ప్రజలకు సావర్కర్ ఆదర్శ పురుషుడని శివసేన వ్యాఖ్యానించింది. గాంధీ.. నెహ్రూల మీదిరి దేశం కోసం సావర్కర్ తన జీవితాన్ని ధారపోశారన్నారు.
దేశ భక్తుడు అవ్వాలంటే భారతీయ రక్తం ఉండాలని.. వీర సావర్కర్ దేశ భక్తుడని కేంద్రమంత్రి గిరి రాజ్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలకుపాల్పడుతున్న రాహుల్ గాంధీకి రాహుల్ జిన్నా పేరే సరిపోతుందని బీజేపీ వ్యాఖ్యానించింది.
రాహుల్ వ్యాఖ్యలపై వీర సావర్కర్ మనమడు రంజిత్ సావర్కర్ స్పందించారు. ఆయన పేరు చివరన సావర్కర్ పేరు లేకపోవటం వల్ల మంచే జరిగిందన్నారు. ఒకవేళ రాహుల్ పేరు చివర సావర్కర్ అని ఉండి ఉంటే తామంతా సిగ్గుతో తలదించుకునేవాళ్లమంటూ గుస్సా అయ్యారు. టార్గెట్ మోడీ అయినప్పడు అనవసరంగా సావర్కర్ ను తీసుకొచ్చి.. ఇష్యూ అంతా అటు వైపు వెళ్లేలా చేయటాన్ని ఏమనాలి?