Begin typing your search above and press return to search.
మోడీని తప్పు పడితే కానీ రాహుల్ టీకా వేయించుకోలేదని గుర్తుకు వచ్చిందే
By: Tupaki Desk | 10 April 2021 6:33 AM GMTరాజకీయాలు భలే సిత్రంగా ఉంటాయి. తమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లితే చాలు ఎక్కడ లేని పాయింట్లను తెర మీదకు తెచ్చేస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ విషయంలో బీజేపీ నేతలు అనుసరిస్తున్న వైనం ఇలానే ఉంది. వ్యాక్సిన్ వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కోవిడ్ టీకా వేయించే అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించటం.. దాన్ని తీవ్రంగా తప్పు పడుతూ రాహుల్ విరుచుకుపడటం తెలిసిందే. ఓపక్క టీకాల కొరత.. మరోవైపు ప్రాణాలు పోతున్న వేళ.. టీకా ఉత్సవం ఏమిటంటూ ఆయన చేసిన విమర్శలు బీజేపీని ఆత్మరక్షణలో పడేలా చేశాయి.
దేశీయంగా ఉత్పత్తి అయ్యే టీకాల్ని దేశీయ అవసరాల కోసం కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేసేలా ఉన్న ప్రభుత్వ విధానాల్ని రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ దేశంలో వ్యాక్సిన్ కొరత లేదన్నారు. అదే సమయంలో.. ఆయనోకొత్త విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని.. ఆయనకు మాత్రం శ్రద్ధ కొరత ఉందన్నారు. అవసరమైన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి రాహుల్ రాసిన లేఖపై కేంద్రమంత్రి ఘాటుగా విమర్శలకు దిగారు. రాహుల్ టీకా ఎందుకు వేయించుకోలేదు? అనుకోకుండా మర్చిపోయారా? ఆయనకు అక్కర్లేదా? లేదంటే బయటకు చెప్పకుండా చేసిన యాత్రల్లో ఎక్కడైనా ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారా? ఆ విషయాన్ని ఆయన వెల్లడించటం లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొరత ఉన్నది వ్యాక్సిన్ కాదని.. ఆరోగ్య సంరక్షణ పట్ల మౌలిక నిబద్ధత అన్న విషయాన్ని రాహుల్ తెలుసుకోవాలన్నారు. రాహుల్ విమర్శలపై అదే పనిగా మండిపడుతున్న కేంద్రమంత్రి.. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదంటున్నారు. నిజంగానే ఆయన మాటలు నిజమని అనుకుందాం. అలాంటప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా.. వ్యాక్సిన్ అవసరమైన వారందరికి ఇచ్చేలా చట్టాన్ని ఎందుకు మార్చటం లేదు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు.. అది కూడా కోవీ షీల్డ్ మాత్రమే. కోవాగ్జిన్ కావాలంటే సాధ్యం కాని పరిస్థితి.
ఒకవైపు వాస్తవం ఇలా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే.. మరోవైపు కేంద్రమంత్రి మాత్రం ఆల్ ఈజ్ అంటూ చెప్పటమే కాదు.. వ్యాక్సిన్ వేసుకోలేదంటూ రాహుల్ ను తప్పు పట్టటంలో అర్థం ఏముంది? ఆ మాటకు వస్తే.. బీజేపీ ముఖ్యమంత్రుల్లో ఎందరు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎంపీల్లో ఎందరువ్యాక్సిన్ తీసుకున్నారు? వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరి కాదు కదా? ఒకవేళ తీసుకోకపోవటం నేరం అంతకన్నా కాదు కదా? అలాంటప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదన్న విమర్శల కంటే కూడా.. వీలైనంత త్వరగా ప్రజలందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం మోడీ సర్కారుమీద ఉందన్నది మర్చిపోకూడదు. విమర్శలు చేసే వారిని టార్గెట్ చేయాలనుకునే కన్నా.. పరిస్థితుల్లో మార్పు తేవటానికి ప్రయత్నిస్తే మంచిగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.