Begin typing your search above and press return to search.
రాహుల్ కు పెను ప్రమాదమే తప్పింది..
By: Tupaki Desk | 26 April 2019 8:21 AM GMTఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెను ప్రమాదం తప్పింది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.. ఈరోజు ప్రచారంలో భాగంగా ఆయన నాలుగోదశ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర - ఒడిసా - బీహార్ లోని కొన్ని ప్రాంతాల ప్రచారానికి బయలుదేరారు.. దీని కోసం ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ప్రచారానికి బయలుదేరారు.. అయితే సడన్ ఢిల్లీ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలోని ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోపే ఇంజిన్ లో లోపాలు తలెత్తాయి. ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడ్డాయి. ఇంజిన్ కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని పైలెట్లు గ్రహించారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో పైలట్లు చాకచక్యంగా తిరిగి విమానాన్ని ఢిల్లీలోనే ల్యాండ్ చేశారు..
శుక్రవారం ఆయన బిహార్ - ఒడిశా - మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచార సభలు - రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బిహార్ లోని సమస్తిపూర్ - ఒడిశాలోని బాలాసోర్ - మహారాష్ట్రలోని సంగమనేర్ లల్లో బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించాల్సి ఉంది. తలెత్తిన సాంకేతిక లోపాన్నిసరిదిద్దిన తర్వాత రాహుల్ తిరిగి ప్రచారానికి బయలుదేరి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి...
రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందన్న వార్త వచ్చిన వెంటనే కాంగ్రెస్ వర్గాలు కొంత ఆందోళనకు గురయ్యాయి.. ఎందుకంటే హెలికాప్టర్ - విమాన ప్రయాణాలు ఆ పార్టీ చాలా సందర్బాల్లో అచ్చిరాలేదు.. ఆ పార్టీ సీనియర్ నేత - ప్రస్తుత కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావ్ సింధియా - ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి - హిమాచల్ ప్రదేశ్ సీఎం ఖండ్జూ లు హెలి కాప్టర్ ప్రమాదాల్లోనే మరణించారు.. దీంతో రాహుల్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందనేసరికి నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం కారణంగా ప్రచారాలు ఆలస్యం కావడంపై రాహుల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.. ప్రజలకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు