Begin typing your search above and press return to search.
ఇందిరమ్మా ఏనాడైనా ఊహించావా : ఈడీ ముందు గంటల తరబడి రాహుల్ గాంధీ
By: Tupaki Desk | 13 Jun 2022 12:38 PM GMTప్రజాస్వామ్యం గొప్పదనం అంటే ఇదేనేమో రాజులు తరాజులు అవుతారు. గొప్పవారు నేలకరుస్తారు. కంటితో శాసించే వారే అవతల వారి కరుణ కోసం అర్రులు చాస్తారు. ఇపుడు ఢిల్లీలో ఒక సన్నివేశం చూస్తూంటే అదే అనిపిస్తోంది. ఈ దేశాన్ని ఒకనాడు గాంధీ వంశీకులు శాసించారు. ఇందిరాగాంధీ అనే ఉక్కు మహిళ అయితే వ్వవస్థల కంటే ఎక్కువగా కనిపించేవారు అంటారు. ఆమె తన మీద ఒక కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని ఏకంగా దేశంలో ఎమర్జెన్సీ విధించి రెండేళ్ళ పాటు దేశమంతా తన కంట్రోల్ లో పెట్టుకున్న ధీర వనిత.
అలాంటి ఇదిరాగాంధీ వారసులను అవే వ్యవస్థలు ఇబ్బంది పెడతాయని ఆమె ఏనాడైనా ఊహించారా. గాంధీ కుటుంబం అంటే ఎవరూ కన్నెత్తి చూడలేనిదని, తాము పాలించడానికే పుట్టామన్న భావన అయితే పాతతరంలో ఉండేది. ఇక ఇందిరాగాంధీని నాడు కాంగ్రెస్ నేతలు పొగుడుతూ ఇందిర అంటే ఇండియా అని ఒక్క మాటలో తేల్చేశారు. అంటే ఇంతటి భారతం అంతా ఇందిరాగాంధీయే అని ఆమె తప్ప మరేమీ లేదని స్పష్టంగా చెప్పారన్న మాట.
అలాంటి ఇదిరమ్మ ముద్దుల మనవడు, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ కొడుకు అయిన రాహుల్ గాంధీ ఇపుడు ఈడీ ముందు గంటల తరబడి విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన్ని ఉదయం పదకొండున్నరకు ఈడీ అధికారులు విచారణకు పిలిపించుకుని మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. భోజన విరామానికి సమయం ఇచ్చి మళ్లీ విచారణ చేశారు. ఇలా గంటల తరబడి ఒక భారతీయ చట్ట వ్యవస్థ ముందు విచారణకు కూర్చోవడం అన్నది గాంధీలకు అలవాటు ఉందో లేదో తెలియదు కానీ దేశం మాత్రం దీన్ని చాలా ఆసక్తిగా చూస్తోంది.
ఇదిలా ఉంటే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారంలో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికే సోనియా సహా రాహుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయగా సోమవారం రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ ఆయన్ని విచారిస్తూ అనేక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇక ఈడీ ఆఫీస్ లో రాహుల్ విచారణకు వస్తూండగా కాంగ్రెస్ శ్రేణులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. రాహుల్ గాంధీ సైతం కాంగ్రెస్ శ్రేణులతో పాదయాత్రగా తరలివచ్చారు. ఆయన వెంట సోదరి ప్రియాంకా గాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుని వెనక్కి పంపేయడంతో ఉద్రిక్తత చెలరేగింది.
దాంతో మండిపోయిన ప్రియాంకా గాంధీ రాహుల్ అంటే ఏమనుకున్నారు. ఆయన సత్యం. సత్యం దేనికీ లొంగదు అంటూ గట్టిగానే నినదించారు. రాహుల్ గాంధీ ధైర్యం ముందు పోలీసుల బారికేడ్స్ కానీ లాఠీలు కానీ ఈడీ బెదిరింపులు కానీ అసలు పనిచేయవని ప్రియాంకాగాంధీ ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈడీ ఆఫీసుకు రాహుల్ విచారణకు రావడం మాత్రం గాంధీల కుటుంబంలో ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియచేస్తోంది. పైన ఉన్న రాహుల్ నాన్నమ్మ ఇందిరాగాంధీ కలలో కూడా ఊహించని వైనం ఇదని అంటే తప్పు కాదేమో.