Begin typing your search above and press return to search.

కౌగిలింత‌పై రాహుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే

By:  Tupaki Desk   |   21 July 2018 1:59 PM GMT
కౌగిలింత‌పై రాహుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే
X
ఒక్క హ‌గ్‌..ఒకే ఒక్క హ‌గ్‌..అంద‌రి చూపు పార్ల‌మెంట్‌పై ప‌డేలా చేసింది. స‌బా వేదిక‌గా అనుహ్య ప‌రిణామాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. అదే...పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని కౌగ‌లించుకోవ‌డం. అవిశ్వాసం చ‌ర్చ‌ల సంద‌ర్భంగా రాహుల్.. తన ప్రసంగం ముగిసిన తర్వాత డైరెక్ట్‌ గా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్లి ఆయనను కౌగిలించుకుని వచ్చారు. తన సీట్‌ లో కూర్చున్న తర్వాత కన్ను కూడా కొట్టారు. మోదీని కౌగిలించుకోవడం - కన్ను కొట్టడం దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మోడీని కౌగిలించుకోవడం - కన్నుకొట్టడం లాంటి వాటికి కూడా మోడీ కౌంటర్ ఇవ్వ‌డం... ఇవ‌న్నీ వైర‌ల్ అయ్యాయి. అన్ని ప్ర‌సార మాధ్యమాలు దీన్ని హైలెట్ చేశాయి.

త‌న‌పై బీజేపీ నేత‌ల ఆక్రోశాన్ని ప్రేమ‌తో జ‌యిస్తాన‌నే ప్ర‌క‌ట‌న‌ను స‌భ వేదిక‌గా చేసిన అనంత‌ర‌మే ఈ కౌగిలింత‌ల ప‌ర్వం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా రాహుల్ ట్విట్ట‌ర్‌ లో స్పందించారు. "నిన్న పార్లమెంట్‌ లో జరిగిన డిబేట్‌ లో అసలు పాయింట్ ఏంటంటే.. ప్రధాని మోడీ.. మనలోని కొంతమంది వ్యక్తుల్లో ద్వేషం - భయం - కోపాన్ని నింపారు. మేము మాత్రం ప్రతి భారతీయుడిలో ప్రేమ - కరుణను నింపుతాము. అవే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. మోడీ ద్వేషాన్ని ప్రేమతో జయిస్తా.." అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

మ‌రోవైపు రాహుల్ లోక్‌ సభ వ్యవహారంపై సోషల్ మీడియా మోత మోగుతోంది. నెటిజన్లు బీభత్సంగా స్పందిస్తున్నారు. సెటైర్లతో దుమ్మురేపుతున్నారు. కాంగ్రెస్ - బీజేపీ సైతం అఫిషీయల్‌ గా స్పందించాయి. నెటిజ‌న్ల కామెంట్ల‌లో ఇవి కొన్ని

-- 2018 పార్లమెంట్ లవ్ స్టోరీ ఇది.. ఇదో అసాధారణమైన లవ్ స్టోరీగా ఉంది.

-- కన్ను కొట్టటం ప్రియా ప్రకాష్ వారియర్ నుంచి నేర్చుకున్నట్లు ఉన్నాడు ఈ పప్పు.

--ప్రియా వారియర్.. నీకు రాహుల్ గాంధీ గట్టిగా పోటాదారుడిగా వచ్చాడు.

-- మోడీని హగ్ చేసుకుని డ్రామాలు చేస్తున్నారు. రాహుల్ నెక్స్ స్టెప్ ఖచ్చితంగా బాలీవుడ్ లో ఉంటుంది.

-- రాహుల్ ని త్వరలోనే బాలీవుడ్ కు పంపిస్తాం అంటూ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ కామెంట్ చేశారు.

-- రాహుల్ గాంధీ మున్నాభాయ్ గా ఎంబీబీఎస్ గా మారిపోయాడు.

--మోడీ.. రాహుల్ హగ్ టేస్ట్ చూశాడు..

-- రాహుల్ చర్చలు చూస్తుంటే.. ఇంకా ఎదగలేదని అనిపిస్తోంది. తనను తనను పప్పూ అని నిరూపించుకున్నాడు.

-- పార్లమెంట్ లో సీరియస్ నెస్ అనే సెన్స్ లేదు.. చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంది.

-- రాహుల్ చర్యలతో అవిశ్వాసం తీర్మానంపై చర్చ అనేది జోక్ గా తయారైపోయింది.

-- అవిశ్వాసంపై సీరియస్ గా చర్చ జరుగుతుంది.. జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ చేష్టలు పార్లమెంట్ స్థాయిని దిగజార్చాయి.

--రాహుల్ స్పీచ్ తో లోక్ సభలో భూకంపం వచ్చింది.