Begin typing your search above and press return to search.
ఏపీ బాధితులంటే రాహుల్ కు చిన్న చూపా?
By: Tupaki Desk | 25 July 2015 5:36 AM GMTరాష్ట్ర విభజన సమయంలో ఏపీ మీద కాంగ్రెస్ కున్న చిన్నచూపు తెలిసిందే. అందరూ ఓకే అన్నాకేగా.. విభజన చేసిందని నంగనాచి కబుర్లు చెప్పినప్పటికీ.. మాటలకు.. చేతలకు మధ్య తేడా అందరికి తెలిసిందే. విభజన విషయంలో రాజకీయ పార్టీలు తలూపినా.. ఎలాంటి వివాదాలు చోటు లేకుండా.. రెండు ప్రాంతాల వారికి మధ్య సమతుల్యం దెబ్బ తీయకుండా విభజన చేపట్టాలని అభ్యర్థించారు.
అయినప్పటికీ.. తాము అనుకున్నట్లే విభజన చేశారే కానీ.. రెండు ప్రాంతాలకు న్యాయం చేసేలా మాత్రం వ్యవహరించలేదు. విభజన కారణంగా ఏపీకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగితే.. తెలంగాణకు పూర్తి స్థాయిలో లాభం చేకూరింది. విభజన విషయంలో తమది ఎలాంటి తప్పు లేదన్నట్లుగా మాట్లాడే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ పట్ల తమకున్న అభిమానాన్ని.. ఏపీ పట్ల తమకున్న వివక్షను చేతల్లో చేసి చూపించారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించేందుకు మొదట తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్.. తాజాగా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. మేలో తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించి.. ఆ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.2లక్షలు చెక్కును అందజేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన క్రమంలో రాహుల్ ఇచ్చిన పరిహారం చెక్కును చూసిన వారి నోట వెంట మాట రాని పరిస్థితి. తెలంగాణలోని రైతు కుటుంబాలకు రూ.2లక్షల చెక్కు ఇస్తే.. ఏపీలో మాత్రం రూ.50వేల చెక్కు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవటం గమనార్హం. బాధితులకు అందజేసే పరిహారం విషయంలోనూ.. తెలంగాణ.. ఏపీల మధ్య మరీ ఇంత వివక్షా..?