Begin typing your search above and press return to search.
బిగ్ క్వశ్చన్: అమ్మాకొడుకులు ఇప్పుడెక్కడ?
By: Tupaki Desk | 17 March 2017 6:13 AM GMTప్రముఖుల జీవితాలు చూస్తే అయ్యో పాపం అనుకోవాల్సిందే. ఆ మధ్యన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు అమ్మ జయలలిత వ్యవహారం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్ లో ఆమెపై దాడి జరిగిందని.. స్పృహలో లేని వేళ.. ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారని.. ఆసుపత్రికి ఆమె వచ్చే ముందే.. సీసీ కెమేరాలు తొలగించినట్లుగా పలువురు ఆరోపణలు చేయటం.. ఆమెకు చేసిన వైద్యంపై పలు సందేహాలు వ్యక్తం కావటం తెలిసిందే.
అసలు.. అమ్మను అత్యంత ప్రముఖులకు కూడా ఎందుకు చూపించలేదు? అన్న ప్రశ్నకు సూటి సమాదానాన్ని ఎవరూ చెప్పనని పరిస్థితి. ఒకవేళ ఆమెను కానీ చూసేందుకు అనుమతిస్తే.. ఇన్ఫెక్షన్ సోకుతుందన్న మాటే నిజమైతే.. శశికళను వైద్యులు ఎందుకు అనుమతించారు? అన్నది మరో ప్రశ్న. ఇలాంటి ఎన్నో ప్రశ్నల నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో ఏం జరిగిందన్న దానిపై పలువురు పలు వ్యాఖ్యలు చేస్తుండటమే కాదు.. అమ్మ అపోలో ఎపిసోడ్ మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ మాదిరి మారిందన్నది మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. ఎప్పుడు తీసుకెళ్లారో? ఎక్కడికి తీసుకెళ్లారో కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యానికి గురైనట్లుగా తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు ఆమె కుమారుడు.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం విదేశాలకు వెళ్లినట్లుగా ఆపార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లుగా సోనియాగాంధీ బయటకు రాకపోవటాన్ని జాతీయ మీడియా ఎందుకు పసిగట్టలేకపోయింది? ఆమెను విదేశాలకు తరలించి వైద్యం చేస్తుంటే.. అదెలాంటి ఆరోగ్య సమస్య? అన్నవి ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. అంతేకాదు.. ఎప్పుడు ఆమెను విదేశాలకు తీసుకెళ్లారన్నది కూడా అంత గుట్టుగా ఎందుకు ఉంచుతున్నారన్నది మరో సందేహం.
భద్రతా పరమైన ఇబ్బందులని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీనే నమ్ముకొని కోట్లాది మంది ఉన్నారని.. వారంతా సోనియా ఫ్యామిలీని అమితంగా అభిమానిస్తుంటారని.. అలాంటి వారికి కీలక విషయాలు చెప్పుకోవటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరి సెలబ్రిటీల జీవితాల్లోకి చొ్చ్చుకెళ్లి మరీ.. వార్తలు అందించే జాతీయ మీడియా.. ఇలా ఒక ప్రముఖ పార్టీ అధినేత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని సైతం గమనించకపోవటం ఏమిటన్నది ఒక ప్రశ్నగా మారింది. తల్లి కోసం తాజాగా రాహుల్ వెళ్లింది ఎక్కడకు అన్న విషయమే కాదు.. ఎప్పుడు తిరిగి వస్తారన్న విషయం మీద కూడా స్పష్టత లేకపోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/