Begin typing your search above and press return to search.
రాహుల్ ఖుషీ... ఈ సామెత చెప్పినట్టే!
By: Tupaki Desk | 21 Dec 2017 3:30 PM GMT‘‘చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’’ మన పల్లెపట్టుల్లో ఒక మోటు సామెత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అచ్చంగా ఈ సామెత చందంగానే ఉన్నట్టుంది. రాహుల్ గాని - ఆయనను భజన చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదిగిపోవాలని ఆశపడుతూ ఉండే ఆయన తైనాతీలు గానీ.. మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఈ సామెత నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. ‘‘పెళ్లికొడుకు చచ్చిన’’ చందంగా ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరాజయాన్నే మూట గట్టుకుంది. ‘‘వచ్చిందే కట్నం’’ అని సంబరపడుతున్నట్లుగా.. గుజరాత్ లో సంఖ్యాపరంగా తమ బలం కాస్త పెరగడాన్ని చూసుకుని తెగ మురిసిపోతోంది. ఇలా చూపరుల్ని మభ్యపెట్టడానికి సంబరపడుతున్నట్లు నటిస్తున్నారో లేదా, రాహుల్ ఇమేజి మీద బ్యాడ్ రిమార్క్ పడకుండా... ముందస్తుగా ఇదంతా రాహుల్ ప్రతిభే అని టముకు వేస్తూ.. ప్రజాభిప్రాయాన్ని తాము అనుకున్నట్లుగా మానిప్యులేట్ చేయడానికి యత్నిస్తున్నారో తెలియదు గానీ.. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు అనుచితమైన ఆనందాన్ని కనబరుస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ సరికొత్త నాయకుడిగా అవతరించాడనేంత వరకు నిజమే. అందులో ఎవ్వరికీ సందేహం లేదు. ఆ పార్టీ తరఫున దేశానికి కాబోయే ప్రధాని కూడా ఆయనే.. గెలిచేంత పరిస్థితే వస్తే.. ఆయనకు ఆ విషయంలో పోటీ పడేవాళ్లు కూడా ఎవరూ లేరు. కాకపోతే.. కిందపడ్డా కూడా పైచేయి నాదే అనే మొండి మాటల జాణతనం కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రదర్శిస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు.
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక.. ఇదివరకటి రాహుల్ లాగా లేరని , ఆయనలో మార్పు వచ్చిందని మాత్రం అనిపిస్తోంది. గతంలో అయితే.. ఆయన ఓటమిని చాలా హుందాగా ఒప్పుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక ‘‘ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు’’ అని ఓపెన్ గా చెప్పుకున్నారు. కానీ ఈ దఫా రెండు రాష్ట్రాల ఓటమి తర్వాత.. ఆయన మాటల్లో మడత పేచీలు కనిపిస్తున్నాయి. ఓడిపోయాం గానీ.. నైతిక విజయం మాదే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గుజరాత్ లో సీట్లు పెరగడమే తమ విజయచిహ్నంగా అభివర్ణిస్తున్నారు. అదే హిమాచల్ ప్రదేశ్ లో చేతిలో ఉన్న అధికారాన్ని వదులుకుని నేలమట్టంగా శిథిలమైన సంగతిని ఆయన ప్రస్తావించడం లేదు.
రాహుల్ తీరు చూసి... తైనాతీలు భజంత్రీలు అంతా రెచ్చిపోతున్నారు. గుజరాత్ లో కాసిని సీట్లు పెరిగాయి అంటే.. దాని అర్థం.. మోడీని దెబ్బకొట్టగల దమ్మున్న నాయకుడు మా రాహుల్ ఒక్కడే అంటూ భజనలు ప్రారంభిస్తున్నారు. బయట బిల్డప్ ల కోసం అలా చెప్పుకుంటే తప్పులేదు గానీ.. ఆత్మసాక్షిగా కూడా వారు అదే సంగతిని నమ్ముకుంటే మాత్రం.. పప్పులో కాలేసినట్లే అని పలువురు విమర్శిస్తున్నారు.