Begin typing your search above and press return to search.

అధ్వాన స్థితిలో భారత్‌.. రాహుల్ ట్వీట్ వైరల్

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:31 PM GMT
అధ్వాన స్థితిలో భారత్‌.. రాహుల్ ట్వీట్ వైరల్
X
కరోనా లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. జీడీపీలు మైనస్ లలోకి పడిపోయాయి. భారతదేశం కూడా పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయింది. ఏకంగా -23 జీడీపీ దశలోకి కూడా జారిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని వివధ సర్వే సంస్థలు తెలిపాయి.

అయితే ప్రపంచదేశాలతో పోలిస్తే కరోనా నుంచి భారత్ అంతవేగంగా కోలుకోవడం లేదని వివిధ సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మనకంటే చిన్న పేద దేశాలు సైతం ఆర్థికవృద్ధి సాధిస్తున్నాయని.. మన ఘనత వహించిన మోడీ పాలనలో దేశంలో అథోగతి పాలవుతోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జీడీపీ వృద్ధి రేటు, కరోనా మరణాలను ఆసియా దేశాలతో పోలుస్తూ బీజేపీ పాలనలో దేశం ఏ దుస్తితికి దిగజారిందో ఎండగట్టారు.

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారత్‌ అధ్వానస్థితిలో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లెక్కలతో సహా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్‌ ద్వారా ఓ గ్రాఫ్ ను పోస్టు చేశారు. ఇందులో బంగ్లాదేశ్‌ 3.8 శాతం, చైనా 1.9 శాతం, పాకిస్థాన్‌ -0.4 శాతం ఉంటే భారత్‌లో మాత్రం - 10.3 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రతి 10 లక్షల మందికి పాక్‌లో 30 మంది.. బంగ్లాదేశ్‌లో 34 మంది మరణిస్తే ఇండియాలో మాత్రం 83 మంది చనిపోతున్నారని రాహుల్ ఈ ట్వీట్ లోని గ్రాఫ్ ద్వారా వివరించారు. రాహుల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.