Begin typing your search above and press return to search.
రాహుల్ హగ్ పై పిట్టకథలు మొదలెట్టిన బీజేపీ
By: Tupaki Desk | 26 July 2018 4:58 AM GMTపిట్టకథలకు కొదవలేనట్లుగా మారింది బీజేపీ నేతల తీరు చూస్తుంటే. తమకు అనువుగా ఉన్న వాటి విషయంలో ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడే కమలనాథులు..తమకు డ్యామేజ్ చేసే వాటిపై అంతే తీవ్రంగా విరుచుకుపడటం మొదట్నించి అలవాటే. తాజాగా.. ఈ తీరులో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మోడీపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోడీని హగ్ చేసుకున్న అంశంలో రాహుల్ తీరుపై ఆ పార్టీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
రాహుల్ హగ్ కు మోడీ సరిగా రెస్పాండ్ కాకపోవటం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తే దాని కంటే ముందే తామే ఆ పని చేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతోనే బీజేపీ వర్గాలు ఎదురుదాడిని స్టార్ట్ చేశాయన్న మాట వినిపిస్తోంది. దీనికి సాక్ష్యంగా మోడీ తీరును ప్రస్తావిస్తున్నారు. రాహుల్ హగ్ ను తప్పు పట్టే క్రమంలో మోడీ ఎగతాళిగా మాట్లాడటం.. చిన్న పిల్లాడి మాదిరి చేతులు తిప్పుతూ కాంగ్రెస్ అధ్యక్షుడ్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రాహుల్ హగ్ ముందే అనుకున్నదని.. సమయం కోసం ఎదురుచూసిన రాహుల్.. హగ్ షాక్ ఇచ్చేశారన్న వాదన తెర మీదకు వచ్చింది. ఈ కథనాన్ని కాంగ్రెస్ కొట్టి పారేయలేదు. అంటే.. మోడీ హగ్ ఇష్యూలో రాహుల్ ముందస్తు ప్లాన్ లో భాగంగానే చేశారన్నది కన్ఫర్మ్ అనుకోక తప్పదు. ఇదిలా ఉంటే.. రాహుల్ హగ్ పై బీజేపీ కొత్తగా మరో పిట్టకథను తెర మీదకు తీసుకొచ్చింది.
బీజేపీ నేతలు తనను పప్పు అన్నా.. తనను ద్వేషించినా.. తాను మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉంటానంటూ రాహుల్ హగ్ వెనుక ఒక తాంత్రికుడి సలహా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఢిల్లీ ప్రతినిధి తేజిందర్ పల్ సింగ్ బగ్లా. ఈ విషయాన్ని తనకు బాగా సన్నిహితుడైన కాంగ్రెస్ నేతే స్వయంగా చెప్పినట్లుగా చెబుతున్నారు. రాహుల్ హగ్ ఎపిసోడ్ లో బీజేపీ నేతల ఎదురుదాడి వర్క్ వుట్ కాకపోవటంతో.. తాంత్రికుడి పిట్టకథను తెర మీదకు తెచ్చారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.