Begin typing your search above and press return to search.

ఆయ‌న ఆదేశంతోనే బాబుతో కుమార‌స్వామి భేటీ?

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:26 AM GMT
ఆయ‌న ఆదేశంతోనే బాబుతో కుమార‌స్వామి భేటీ?
X
మొన్నామ‌ధ్య‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి భేటీ కావ‌టం తెలిసిందే. కనక దుర్గమ్మ దర్శనం కోసం బెజ‌వాడ వ‌చ్చిన క‌ర్ణాట‌క రాష్ట్ర సీఎంతో బాబు భేటీ అయిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదంతా మ‌ర్యాద‌పూర్వ‌కం స‌మావేశంగా చెప్పినోళ్లు ఉన్నారు.

అయితే.. భేటీకి సంబంధించి తెర వెనుక క‌థ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం పొత్తుల విష‌యంలో బాబుతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకే కుమార‌స్వామిని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పంపిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరే అంశాలు లేక‌పోలేదు.

బాబుతో భేటీకి ముందు కుమార‌స్వామి.. ఢిల్లీలో రాహుల్ తో భేటీ కావ‌టాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీలో బాబు గెలిచే ప‌రిస్థితి లేదు. పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయిన బాబు స‌ర్కారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రువు ద‌క్కించుకోవాలంటే ఎవ‌రో ఒక‌రితో జ‌త క‌ట్టాల‌ని భావిస్తోంది.

ఇందుకు సంబంధించి ఇప్పుడా పార్టీకి ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీనే. విభ‌జ‌న పాపాన్ని మూట‌క‌ట్టుకొని.. శాప‌గ్ర‌స్తంగా మారిన కాంగ్రెస్ ను తోడుగా తెచ్చుకుంటే ఎంతోకొంత ఓట్లు ప‌డ‌తాయ‌ని.. గౌర‌వ‌నీయ సీట్లు ద‌క్కే వీలుంద‌న్న అభిప్రాయం ఉంది. ఓట‌మి భ‌యాన్ని అధిగ‌మించేందుకు వీలుగా కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌రో పాతికేళ్ల వ‌ర‌కూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఊసే లేని ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌లో విన్ టు విన్ అన్న వ్యూహంలో భాగంగా బాబుకు అండ‌గా కాంగ్రెస్‌.. ఏపీ రాష్ట్ర ప‌రిస్థితి పాతాళానికి పడిపోయేందుకు కాంగ్రెస్ కు ఏపీ అధికార‌ప‌క్షం తోడుగా నిలిస్తే.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్నో ఇన్నో సీట్లు సొంతం చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాయి. ఇందులో భాగంగానే బాబు వ‌ద్ద‌కు కుమార‌స్వామి ద్వారా రాహుల్ పంపాల్సిన సందేశాన్ని పంపిన‌ట్లుగా చెబుతున్నారు.