Begin typing your search above and press return to search.
నమ్మండిః మోడీ కంటే రాహులే తోపు
By: Tupaki Desk | 10 Nov 2015 4:09 PM GMTబీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజుల దాటుతున్నప్పటికీ విశ్లేషణ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా మోడీ హవా సాగుతున్నదనే ప్రచారం ఉన్న సమయంలో ఆయన నేతృత్వంలోని పార్టీ ఓటమి పాలవడం, బీజేపీకి కంట్లో నలుసుగా మారిన నితీశ్ సారథ్యంలోని మహాకూటమి దుమ్మురేపే విజయం సాధించడంతో ఈ చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్న మోడీ బీహార్ లో సుడిగాలి పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంతకీ మోడీ పర్యటన ఎంతవరకు వర్కవుట్ అయిందనే ఆసక్తికలగడం సహజమే. అలా జరిగిన విశ్లేషణలో ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేసిన చాలా చోట్ల అభ్యర్థులు ఓటమి చెందినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 26 నియోజకవర్గాల్లో మోడీ ప్రచారం చేయగా అందులో 16 స్థానాల్లో అభ్యర్థులు ఓటమి చెందారు. కేవలం 10 చోట్ల మాత్రమే ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. ఆమె ప్రచారం చేసిన నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మంచి ఫలితాలనే సాధించారు.ఎన్నికల పర్యటనలో భాగంగా 12 ర్యాలీలలో పాల్గొన్న రాహుల్ 8 మంది అభ్యర్థులను గెలిపించుకోగలిగారు.
సునామీలా సాగిన మోడీ హవా అంతే వేగంగా తగ్గిపోయిందా? లేక స్థానిక కారణాలే ఇందుకు కారణమా అనేది తేల్చడంలో రాజకీయ విశ్లేషకులు బిజీగా ఉన్నారు.