Begin typing your search above and press return to search.
బిహార్ లో కాంగ్రెస్ ఓటమి...జైసల్మీర్ లో రాహుల్ టూర్
By: Tupaki Desk | 11 Nov 2020 2:10 PM GMTబిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో చివరకు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే పై చేయి అయింది. బిహార్‌లో మొత్తం 243 స్థానాలుండగా 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 మేజిక్ ఫిగర్‌ని దాటిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ-74, ఆర్జేడీ-75, జేడీయూ-43, ఎల్జేపీ-01, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-03, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. అయితే, 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఓ రకంగా కాంగ్రెస్ కు 70 సీట్లిచ్చి తప్పు చేశారని తేజస్వి యాదవ్ పై కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమిపై తేజస్వి కారణాలు విశ్లేషిస్తున్నారు. అదే తరహాలో రాహుల్ గాంధీ కూడా ఓటమిపై విశ్లేషణ జరపాలి. కానీ, రాహుల్ మాత్రం తనకేమీ పట్టనట్టు 2 రోజుల పాటు రిలాక్స్ అయ్యేందుకు జైసల్మీర్ టూర్ వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.
బిహార్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. అయితే, క్రమక్రమంగా అక్కడ పట్టు కోల్పోతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కుదేలైంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇటువంటి సమయంలో సీరియస్ గా ఓటమిపై విశ్లేషణలు జరిపి బెంగాల్ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన రాహుల్ గాందీ....సరదాగా కాసేపు సేద తీరేందుకు టూర్ వెళ్లారు. 10 మంది మిత్రులతో కలిసి రెండు రోజుల పాటు జైసల్మేర్ విహార యాత్రకు వెళ్తున్న రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన యాత్రకు ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులను కోరారు రాహుల్. సూర్యగఢ్‌లోని కోటలో ఒక రోజు రాహుల్ బృందం బస చేయనుందట. ఇఖ, రెండో రోజు ఎడారిలోని ఓ టెంట్‌లో బస చేయాబోతున్నారట. ఈ విహార యాత్ర విషయాన్ని రాహుల్ అత్యంత గోప్యంగా ఉంచాలనుకున్నా....ఆ విషయం లీక్ అయింది. మరి, రాహుల్ సీరియస్ గా ఎన్నికలు, ఓటములపై ఫోకస్ చేయకుంటే....రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు మరింత గడ్డుకాలమని విశ్లేషకులు అంటున్నారు.