Begin typing your search above and press return to search.

మేడిన్ చైనా.. రాహుల్ 'మేడిన్ ఇటలీ'..

By:  Tupaki Desk   |   28 Sep 2018 11:01 AM GMT
మేడిన్ చైనా.. రాహుల్ మేడిన్ ఇటలీ..
X
విగ్రహ రాజకీయం కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మాటలు దుమారం రేపుతున్నాయి. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ‘మేడిన్ చైనా’ అంటూ గురువారం వ్యాఖ్యానించి దుమారం రేపారు.

అయితే తాజాగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ దీనికి ధీటుగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘మేడిన్ ఇటలీ’ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సర్దార్ వల్ల భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం కోసం 1700 టన్నుల కాంస్యాన్ని మాత్రమే తాము చైనా నుంచి దిగుమమతి చేసుకున్నామని.. 70000 టన్నుల ఇనుము - 18500 టన్నుల స్టీల్ భారత్ లోదేనని స్పష్టం చేశారు. ఈ విగ్రహం పూర్తిగా మేడిన్ ఇండియా అన్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేసే కాంట్రాక్ట్ ఇండియా కంపెనీ ఎల్ అండ్ టీకి దక్కిందని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ శరీరంలో ఇటాలియన్ రక్తం ప్రవహిస్తోందని.. ఆయన మేడిన్ ఇటలీనే అంటూ నితిన్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఖ్యాతిని తుడిచేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని సెటైర్ వేశారు. భారత స్వాతంత్ర్య ఘనతను కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికే చెందాలని రాహుల్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై ఆడిపోసుకుంటున్నారని నితిన్ పటేల్ విమర్శలు గుప్పించారు.