Begin typing your search above and press return to search.
విద్యార్థులతో కలిసి ‘‘యువరాజు’’ దీక్ష
By: Tupaki Desk | 30 Jan 2016 4:28 AM GMTకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మరోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేశారు. కేవలం రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలో.. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే పది రోజుల వ్యవధిలోనే ఆయన రెండుసార్లు హైదరాబాద్ కు వచ్చారు. వందలాది మంది తెలంగాణ యువకులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు విడిచినప్పుడు.. తెలంగాణ కోసం తెలంగాణ సమాజం మొత్తం ఏకమైనప్పుడు పత్తా లేకుండా పోయిన రాహుల్.. అందుకు భిన్నంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై మాత్రం సీరియస్ గా స్పందిస్తున్నారు. అతడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఇష్యూ మీద వర్సటీకి వచ్చి ఈ ఉదంతాన్ని జాతీయాంశంగా మార్చిన రాహుల్.. రోహిత్ ఆత్మహత్య ఉదంతం బయటకొచ్చిన పదకొండో రోజు అర్థరాత్రి వేళ వర్సిటీకి వచ్చేశారు. రోహిత్ జయంతిని పురస్కరించుకొని.. అతని మృతికి నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దుతుగా తాజాగా రాహుల్ నిరసన దీక్షలో పాల్గొనేందుకు స్వయంగా హాజరు కావటం గమనార్హం. శుక్రవారం అర్థరాత్రి సమయంలో వర్సిటీకి చేరుకున్న రాహుల్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని చెదరగొట్టిన పోలీసులు రాహుల్ కు ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వందలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఆర్పిస్తూ.. తెలంగాణ సమాజం మొత్తం ఆందోళన పథంలోకి వెళ్లినప్పుడు కానీ.. అవినీతి భారతం మీద దేశం మొత్తం ఉద్యమించినప్పుడు పత్తా లేని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. రోహిత్ ఇష్యూలో నిరసన వ్యక్తం చేయటమే కాదు.. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో కూర్చోవటం విశేషం. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు యువరాజు చేస్తున్న దీక్ష ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రాహుల్ లాంటి నేత స్వయంగా దీక్షలోకూర్చోవటం ఎందుకు? అంతలా ఆయన రోహత్ ఇష్యూలో ప్రాధాన్యత ఇస్తున్నారన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థి అయిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీని.. రోహిత్ ఉదంతంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటం మర్చిపోకూడదు.