Begin typing your search above and press return to search.

రాహుల్ మాట‌తో గూగుల‌మ్మ‌ను తెగ వెతికేశార‌ట‌!

By:  Tupaki Desk   |   21 July 2018 4:44 AM GMT
రాహుల్ మాట‌తో గూగుల‌మ్మ‌ను తెగ వెతికేశార‌ట‌!
X
మోడీ స‌ర్కారుపై టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టిన కార‌ణంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు అన్ని ఇన్ని కావు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ వాడిన ఒక ప‌దం గురించి ప‌లువురికి సందేహం క‌లిగింద‌ట‌. రాహుల్ మాట‌.. అనంత‌రం ఆయ‌న మోడీని హ‌గ్ చేసుకున్న వైనం.. ఆ వెంట‌నే వెన‌క్కి వ‌చ్చి త‌న కుర్చీలో కూర్చున్న త‌ర్వాత ఆయ‌న క‌న్ను గీటిన వైనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

హ‌గ్ చేసుకొని హుందాగా కూర్చొని ఉంటే ఒక ర‌కంగా ఉండేదేమో కానీ.. ఆ వెంట‌నే క‌న్ను గీటిన వైనం ఎట‌కారంగా మార‌ట‌మే కాదు.. ఎవ‌రికి వారు తెగ జోకులు వేసుకునే ప‌రిస్థితి. త‌న తీరుతో రాహుల్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారారు.

అవిశ్వాసంపై సాగిన చ‌ర్చ‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. త‌న ప్ర‌సంగంలో జుమ్లా అనే ప‌దాన్ని ఉప‌యోగించారు. రాహుల్ నోటి నుంచి వ‌చ్చిన జుమ్లా స్ట్రైక్స్ అనే ప‌దానికి అర్థం తెలుసుకోవ‌టానికి ద‌క్షిణాది ప్ర‌జ‌లు తెగ ట్రై చేసిన వైనం తాజాగా వెల్ల‌డైంది.

రాహుల్ త‌న ప్ర‌సంగంలో అదే ప‌నిగా జుమ్లా ప‌దాన్ని వాడుతూ మోడీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో అస‌లీ జుమ్లా అనే ప‌దానికి అర్థం ఏమిటో తెలుసుకోవ‌టానికి ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారు ఆ ప‌దానికి అర్థం ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అయితే.. స‌మాధానం రాక‌పోవ‌టంతో గూగుల‌మ్మ‌ను ఆశ్ర‌యించార‌ట‌. ఇదే విష‌యం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ చూస్తే.. ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

జూమ్లా అంటే ఏమిటి? జుమ్లాలో హిందీలో అర్థం ఏమిటి? జుమ్లా అనే ప‌దాన్ని ఏయే స‌మ‌యాలు.. సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తారు? లాంటి ప్ర‌శ్న‌లకు స‌మాధానాల కోసం శోధించార‌ట‌. జుమ్లీ అనే ప‌దానికి అర్థం చూస్తే.. న‌కిలీ హామీగా చెబుతున్నారు. జుమ్లూ ప‌దానికి అర్థం ఉర్దూ.. హిందీ ప‌దాల్లో ఉంద‌ని.. న‌కిలీ హామీల‌కు నిద‌ర్శ‌నంగా వాడ‌తార‌ని చెబుతున్నారు.

ఇక.. రాహుల్ నోటి నుంచి వ‌చ్చిన ప‌దానికి అర్థం తెలుసుకోవ‌టం కోసం క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అత్య‌ధికంగా వెతికేశార‌ట‌.. క‌న్న‌డిగుల త‌ర్వాతి స్థానంలో త‌మిళులు 64 శాతం మంది .. 62 శాతం మంది తెలంగాణ ప్ర‌జ‌లు ఉన్నారు. వెతుకులాట‌కు సంబంధించి కేర‌ళ వాసులు 57 శాతం చివ‌రిస్థానంలో న‌లిచారు. నకిలీ హామీల పేరుతో ఉండే ఈ ప‌దాన్ని ఏయే సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తార‌న్న అంశంపైనా గూగుల‌మ్మ‌ను తెగ వెతికేశార‌ట మొత్తానికి జుమ్లా పేరును రాత్రికి రాత్రి ఫుల్ ఫేమ‌స్ చేసిన ఘ‌న‌త రాహుల్ గాంధీకి ద‌క్కుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.