Begin typing your search above and press return to search.

రాహుల్ కి కరోనా సోకిండచ్చు..బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 March 2020 1:10 PM GMT
రాహుల్ కి కరోనా సోకిండచ్చు..బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
X
నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కరోనా వైరస్ టెస్ట్ చేపించుకోవాలని బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ కోరారు. అయన ఇటీవలే ఇటలీ పర్యటన పూర్తి చేసుకొని , ఇండియా కి తిరిగి వచ్చిన నేపథ్యంలో , అయాన్లకి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని , ఒకవేల ఆయనకి వైరస్ సోకింటే, అయన వల్ల చాలామందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని , కాబట్టి రాహుల్ ఒకసారి కరోనా టెస్ట్ చేపించుకుంటే మంచిది అని గురువారం లోక్ సభలో తెలిపారు.

ఎందుకు అంటే ... టలీ నుంచి ఈ దేశానికి చేరుకున్న చాలామందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలిందన్నారు. అలాగే,ఇదే సమయంలో దేశంలో ఒక్కొక్కటిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించడంపై బీజేపీ ప్రశ్నించింది. ప్రజల్లోకి రాజకీయ నేతలు వెళ్లి ధైర్యం చెప్పడం మంచిదేనని, కానీ దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరు రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చారని, ఆ దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. ఎయిర్‌పోర్టులో ఆయన స్క్రీనింగ్ టెస్టు చేయించుకున్నారా లేదా చెప్పాలని అడిగారు.

ఆరు రోజుల క్రితమే ఇటలీ నుండి వచ్చిన రాహుల్ ఎటువంటి మాస్క్ లేకుండా ఢిల్లీ విధుల్లో పర్యటన చేసారని , అలాగే పార్లమెంట్ సమావేశాలకు హాజరైయ్యారని, ఒకవేల ఆయనకి కరోనా వైరస్ ఉంటే , అయన వల్ల మొత్తం పార్లమెంట్ లోని ఎంపీలందరూ కరోనా భారిన పడే అవకాశముంది అని , అందుకే అయన ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేపించుకొని , ఆ పరీక్షల్లో తేలిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంటుకు తెలియజేయాలని కూడా రమేష్ సూచించారు. మరోవిషయం ఏమిటంటే ..ఇండియాలో 29 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 16 మంది ఇటాలియన్ టూరిస్టులే కావడం గమనార్హం!