Begin typing your search above and press return to search.
'టీ' జిల్లా సారథులకు రాహుల్ మార్క్ షాక్
By: Tupaki Desk | 21 Oct 2016 6:09 AM GMTతెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకూ పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. దసరా నుంచి 31 జిల్లాలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్న పార్టీ నాయకత్వం.. తెలంగాణ రాష్ట్రం వరకూ ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. జిల్లాల సంఖ్య భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. పార్టీ బలోపేతం అయ్యేలా చేసేందుకు కొత్త తరహా నిర్ణయాన్ని తీసుకుంది.
ఇందులో భాగంగా.. జిల్లా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. రానున్న రోజుల్లో సాధారణ ఎన్నికల్లో డీసీసీ చీఫ్ లకు టికెట్లు కేటాయించకూడదని డిసైడ్ చేశారు. డీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించే నేతలంతా పార్టీని బలోపేతం చేయటంపైనే దృష్టి పెట్టాలన్నది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనగా చెబుతున్నారు.
పార్టీ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయాన్ని రాహుల్ తీసుకున్నట్లు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తూ.. వారి నియోజకవర్గం మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారని.. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే సరికొత్త నిర్ణయాన్నిరాహుల్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యే జిల్లా పార్టీ ముఖ్యనేతలకు.. ఎమ్మెల్సీలు.. ఇతర నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ యువరాజు తీసుకున్న తాజా నిర్ణయం పార్టీ వర్గాలకు ‘కొత్త’ షాక్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.